షియోమీ హోలీ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్, బడ్స్ కొనుగోలుపై రూ.2200 వరకు తగ్గింపును పొందవచ్చు..!
హోలీ సందర్భంగా షియోమీ సంస్థ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. షియోమీ హోలీ సేల్ 2024లో (Xiaomi Holi Sale 2024) భాగంగా స్మార్ట్‌ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ హెడ్‌ఫోన్లు సహా ఇతర అనేక ఉత్పత్తులపై ఆకట్టుకొనే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
షియోమీ సేల్ పేజీ ఆధారంగా అన్ని ఉత్పత్తులపై రూ.950 కూపన్‌లు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ హోలీ సేల్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 13 ప్రో (Redmi Note 13 pro Smartphone) పై ఆకట్టుకొనే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సహా రెడ్‌మి బడ్స్ 5 ను రూ.27000 కంటే తక్కువకే కొనుగోలు చేయవచ్చు.

షియోమీ అధికారిక పేజీలోనే ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ మరియు రెడ్‌మి బడ్స్ 5 (Redmi Buds 5) రెండింటిని రూ.26,798 కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పల్,, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
అదే రెడ్‌మి బడ్స్ 5 ను ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ వైట్ లేదా పర్పల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా రెడ్‌మి ఫోన్ ధర రూ.25,999 గా ఉంది. అదే బడ్స్ ధర రూ.2999 గా ఉంది. ఈ రెండింటిని వేర్వేరుగా ధర రూ.28,998 కు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.2200 తగ్గింపును పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ (Redmi Note 13 pro Specs) 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. 200MP ప్రైమరీ కెమెరా, 8MP సహా 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పైన పనిచేస్తుంది. స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 67W ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెడ్‌మి బడ్స్ 5 12.4mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. హైబ్రిడ్ 46db ANC సపోర్టుతో వస్తుంది. ఒక్కో బడ్ 54mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే ఛార్జింగ్ కేస్ 480mAh సపోర్టుతో వస్తుంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








