టోక్యో ఒలింపిక్స్ 2020 విజేతలకు షియోమి ఇండియా ప్రత్యేక బహుమతి

|

టోక్యో ఒలింపిక్స్ 2020 ఇటీవల ముగిసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో ఇండియా తరపున పాల్గొని మంచి ప్రతిభను చూపి పతకంను సాధించిన భారతీయ అథ్లెట్లందరికీ షియోమి ఇండియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ యొక్క సరికొత్త Mi 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. షియోమి ఇండియా ఎండి మను కుమార్ జైన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

షియోమి ప్రత్యేక బహుమతి

షియోమి ప్రత్యేక బహుమతి

టోక్యో ఒలింపిక్స్ 2020 లో ఇండియా తరపున చాలా విభాగాలలో పాల్గొన్నవారు చాలా మంచి ప్రదర్శనను ఇచ్చారు. ఈ ఒలింపిక్స్ లో ఇండియా మొత్తంగా ఏడు పతకాలను గెలుచుకుంది. 2012 లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు దేశం అత్యధిక పతకాలను సాధించింది. ఈ ప్రదర్శనకు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించాడు. ఒలింపిక్ క్రీడల చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.

UAN అంటే ఏమిటి?? ఈ నంబర్‌ని కనుకోలేకున్నారా?? అయితే ఇలా చేయండి...UAN అంటే ఏమిటి?? ఈ నంబర్‌ని కనుకోలేకున్నారా?? అయితే ఇలా చేయండి...

2020 టోక్యో ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో భారతదేశం పతకాలు

2020 టోక్యో ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో భారతదేశం పతకాలు

గుర్తుకు తెచ్చుకుంటే భారతదేశం ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మొత్తం 10 బంగారు పతకాలను గెలుచుకుంది. పురుషుల హాకీ జట్టు వాటిలో ఎనిమిదింటిని క్లెయిమ్ చేసింది. అభినవ్ బింద్రా మరియు నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పథకాలను సాధించిన వ్యక్తులుగా రికార్డులలో ఉన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా కాకుండా మీరాబాయి చాను, రవి కుమార్ దహియా, లవ్లినా బోర్గోహైన్, పివి సింధు మరియు బజరంగ్ పునియా వంటి వారు అంతర్జాతీయ మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో పతకాలు సాధించారు. వీరందరికి కూడా షియోమీ సరికొత్త ఫోన్ Mi 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. షియోమి సంస్థ అందించే బహుమతులను పక్కన పెడితే భారత కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మర్ ఒలింపిక్స్ మరియు టోక్యో 2020 లో బాగా రాణించిన అథ్లెట్లకు బహుమతులను ప్రకటించింది.

భారత హాకీ జట్టు ఆటగాళ్లకు Mi 11X

భారత హాకీ జట్టు ఆటగాళ్లకు Mi 11X

2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా యొక్క హాకీ జట్టు కాంస్య పతకం సాధించినందున భారత పురుషుల హాకీ జట్టులోని ప్రతి వ్యక్తికి Mi 11X స్మార్ట్‌ఫోన్ ను బహుమతిగా అందివ్వనున్నట్లు కూడా జైన్ ధృవీకరించారు.

Xiaomi Mi 11 అల్ట్రా ధర

Xiaomi Mi 11 అల్ట్రా ధర

Xiaomi Mi 11 అల్ట్రా అనేది కంపెనీ యొక్క 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర రూ. 69,999. అలాగే Mi 11X అనేది భారతదేశంలో అందుబాటులో ఉన్న Mi 11 సిరీస్‌లో 6GB RAM/128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 మరియు 8GB RAM/128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999.

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్

షియోమి సంస్థ సంస్థ కొత్త Mi11 అల్ట్రా ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఇటీవల ఇండోనేషియాలో ధృవీకరణ కూడా లభించినట్లు సంస్థ తెలిపింది. అలాగే దీనిని హ్యాండ్-ఆన్ వీడియోలో కూడా చూపడం జరిగింది. ఇది కంపెనీ Mi 11 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్‌గా యూజర్ల ముందుకు రానున్నది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 67W వైర్డ్ ఛార్జింగ్ తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు పుకారు ఉంది. దీని స్పీకర్లు హర్మాన్ కార్డాన్ ట్యూన్ చేసినట్లు చెబుతారు. ఇది IP68 డస్ట్ మరియు నీటి నిరోధకతతో రావచ్చు మరియు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi India Announced Special Prize For Tokyo Olympics 2020 Winners

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X