షియోమీ ఫోన్‌లను అమ్ముకోవచ్చు, కాస్తంత ఊరట

Posted By:

చైనా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ పై గతవారం విధించిన బ్యాన్‌ను ఢిల్లీ హైకోర్ట్ పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో షియోమీ ఇండియాకు కాస్తంత ఊరట లభించనట్లైంది. షరతులతో కూడిన ఈ బ్యాన్ ఎత్తివేత నేపధ్యంలో షియోమీ తన క్వాల్కమ్ చిప్‌సెట్ ఫోన్‌లను జనవరి 8 వరకు భారత్‌లో విక్రయించుకోవచ్చు.

 షియోమీ ఫోన్‌లను అమ్ముకోవచ్చు, కాస్తంత ఊరట

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బ్యాన్ అమలులోకి రాక ముందు షియోమీ బ్రాండ్‌కు సంబంధించి భారత్‌లో రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటిలో రెడ్‌మై 1ఎస్ మోడల్ క్వాల్కమ్ చిప్‌సెట్‌తో, రెడ్‌మై నోట్ మోడల్ మీడియాటెక్ ప్రాససర్‌తో లభ్యమయ్యేవి.

మరోవైపు, తమ షెడ్యూల్‌లో భాగంగా డిసెంబర్ మధ్య నాటికి ‘రెడ్‌మై నోట్ 4జీ' ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువస్తామని  షియోమీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ 4జీ ఫోన్ కూడా క్వాల్కమ్ చిప్‌సెట్ పైనే రన్ అవుతుంది. ఈ వెసులుబాటు నేపధ్యంలో షియోమీ తమ రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ 4జీ ఫోన్‌‍లను దాదాపు నెల రోజుల నిరాటకంగా విక్రయించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఏం జరిగిదంటే...

భారత్ మార్కెట్లో అతితక్కువ కాలంలోనే అమితమైన ప్రజాదరణను సొంతం చేసుకున్న చైనా మొబైల్ ఫోన్‌ల కంపెనీ‘షియోమీ'(Xiaomi) పై ఢిల్లీ హైకోర్ట్ బ్యాన్ విధించింది. భారత్‌లో షియోమీ ఫోన్‌ల విక్రయాలను నిలిపివేయాలంటూ షియోమీతో పాటు ఆ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎరిక్సన్ సంస్థకు చెందిన టెక్నాలజీ పేటెంట్ హక్కులను షియోమీ ఉల్లంఘిస్తోందన్న అభియోగాల నేపధ్యంలో ఈ తీర్పు వెలువరించింది.

ఈ ఉత్తర్వులో భాగంగా భారత్‌లో షియోమీ ఫోన్‌ల దిగుమతులను నిరోధించాలని కస్టమ్స్ అధికారులకు న్యాయస్థానం సూచించింది. అంతేకాకుండా, షియమీ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇప్పటి వరకు భారత్‌లో విక్రయించిన ఫోన్‌లకు సంబంధించి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయవల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. ఈ క్రమంలో షియోమీ, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలను పరిశీలించేందుకు ముగ్గురు స్థానిక కమీషనర్లను కోర్టు నియమించింది. వీరికయ్యే ఖర్చులను ఎరిక్సన్ సంస్థ భరించాలి. ఈ అంశానికి సంబంధించి నాలుగు వారల్లోపు నివేదికను కమీషనర్లు సమర్పించాల్సి ఉంది.

English summary
Xiaomi India ban partially lifted by Delhi HC. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot