Xiaomi బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వీటి కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు...

|

చైనా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి భారతదేశంలో తన యొక్క వెబ్ సైట్ లో కొత్తగా "బ్లాక్ ఫ్రైడే సేల్‌ను" ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో కంపెనీ తన యొక్క అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో సాధారణ తగ్గింపులే కాకుండా కంపెనీ వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ డీల్స్, EMI ఆఫర్‌లు మరియు మరిన్నింటితో సహా అదనపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది మరియు నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వాటిపై అదనంగా రూ.4000 వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రస్తుత సేల్ లో లభించే అత్యుత్తమ డీల్‌ల వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

RedmiBook 15 ఇ-లెర్నింగ్ ఎడిషన్

RedmiBook 15 ఇ-లెర్నింగ్ ఎడిషన్

RedmiBook 15 ఇ-లెర్నింగ్ ఎడిషన్ 11వ Gen Core i3 ద్వారా ఆధారితం ప్రస్తుతం రూ. 37,999 నుండి ప్రారంభమవుతుంది. తగ్గింపు ధరతో పాటు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 2,500 అదనపు తగ్గింపును పొందుతారు.

RedmiBook 15 Pro

RedmiBook 15 Pro

RedmiBook 15 Pro ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.47,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే అదనంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో పాటు రూ. 3,500 అదనపు తగ్గింపుతో కస్టమర్‌లు దీన్ని రూ. 44,499కి పొందవచ్చు. ల్యాప్‌టాప్‌లోని కోర్ స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులకు అనువుగా సరసమైన నోట్‌బుక్‌ల వలె లభించే అవకాశం ఉంది. అయితే రెడ్‌మి AMD యొక్క రైజెన్ ప్రాసెసర్‌లతో లభిస్తుంది.

Mi TV 4A 43 హారిజన్ ఎడిషన్
 

Mi TV 4A 43 హారిజన్ ఎడిషన్

Mi TV 4A 43 హారిజన్ ఎడిషన్ ప్రస్తుతం రూ.26,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు అదనంగా రూ.1,500 తగ్గింపు లభించడంతో రూ.25,499 ప్రభావవంతమైన తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 4K రిజల్యూషన్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా టీవీ యొక్క మరొక ప్రధాన హైలైట్ MEMC టెక్నాలజీతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతును కలిగి ఉంటుంది. అందువల్ల ఇది సోనీ ప్లేస్టేషన్ 5 మరియు Xbox సిరీస్X వంటి ప్రస్తుత-జెన్ గేమింగ్ కన్సోల్‌లను ఉపయోగించేవారు అధునాతన వీడియో ఫీచర్ల యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ స్మార్ట్ టీవీ Wi-Fi, బ్లూటూత్, Chromecast మరియు మరిన్ని వంటి కనెక్టివిటీ టెక్నాలజీలకు మద్దతు ఇవ్వగలదు. 4A హారిజోన్ ఎడిషన్ వినియోగదారునికి 178-డిగ్రీల వీక్షణ కోణాన్ని మరియు వివిడ్ పిక్చర్ ఇంజిన్‌ ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

Mi రోబోట్ వాక్యూమ్-మాప్ క్లీనర్

Mi రోబోట్ వాక్యూమ్-మాప్ క్లీనర్

Mi Robot Vacuum-Mop క్లీనర్ ప్రస్తుతం రూ. 21,999కి అందుబాటులో ఉంది. అయితే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.2,000 వరకు తగ్గింపును పొందడానికి అర్హులు అవుతారు.

Xiaomi Mi 11 సిరీస్

Xiaomi Mi 11 సిరీస్

Xiaomi Mi 11 Lite NE ప్రస్తుతం రూ.21,499కి అందుబాటులో ఉంది. అలాగే Mi 11X ప్రస్తుతం రూ.22,499 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. చివరిగా ఈ సిరీస్ లోని Mi 11X Pro రూ.31,499 వద్ద వద్ద అందుబాటులో ఉంది.

 

Xiaomi 11 Lite NE 5G

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.21,499 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ కార్డ్ల కొనుగోలు మీద రూ.2500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

 

Redmi Smart TV X సిరీస్

ఇవి కాకుండా Redmi Smart TV X సిరీస్, MI LED TV 4C 43, Mi Super Bass వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, Mi అవుట్‌డోర్ బ్లూటూత్ స్పీకర్, Redmi ఇయర్‌బడ్స్ 2C, Mi ఇయర్‌ఫోన్స్ బేసిక్, Mi స్మార్ట్ బ్యాండ్ 5, Mi వంటి అనేక ఇతర ఉత్పత్తులపై కంపెనీ డిస్కౌంట్లను కలిగి ఉంది. స్మార్ట్ బ్యాండ్ 6, Mi రూటర్ 4C, Mi పవర్ బ్యాంక్ 3i, Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా 2K ప్రో మరియు మరిన్ని కొనుగోలు మీద కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi India Black Friday Sale live on Company Website: Best Discount Deals on These Products.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X