సెప్టెంబర్ 27న , ఒకేసారి ఐదు ప్రొడక్ట్స్ ను లాంచ్ చేయనున్న షియోమి
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో ఒకేసారి ఐదు ప్రొడక్ట్స్ ను విడుదల చేయబోతోంది.Mi Max 3 ఫోన్ ,Mi Band 3, Mi TV4,Mi 360 వైర్లెస్ కెమెరా, air purifier ను విడుదల చేయనుంది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో ఒకేసారి ఐదు ప్రొడక్ట్స్ ను విడుదల చేయబోతోంది.Mi Max 3 ఫోన్ ,Mi Band 3, Mi TV4,Mi 360 వైర్లెస్ కెమెరా, air purifier ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 27, ఉదయం 11.30కి లాంఛ్ ఈవెంట్ జరగనుంది. ఇటీవల దేశీయ మార్కెట్లో Redmi 6, Redmi 6 Pro, Redmi 6A ఫోన్లు విడుదలై కొద్ది వారాలు గడవకముందే షియోమి మరి కొన్ని ప్రొడక్ట్స్ ను విడుదల చేయడం గమనార్హం. దీన్నిబట్టి వేరే బ్రాండ్లకు వెళ్లకుండా వినియోగదారులకు ఏకైక ఛాయిస్‌గా నిలవడం కోసం షియోమి చేస్తున్న ప్రయత్నాలు అర్థం చేసుకోవచ్చు.

Mi Max 3....
Mi Max 3 విషయానికొస్తే, 6.9 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, 520 nits గరిష్ట బ్రైట్నెస్ ఇది కలిగి ఉంటుంది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 processor ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 6GB RAM, 128 GB స్టోరేజ్ ఉన్న మోడల్ కూడా లభిస్తాయి. కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 12 మరియు 5 మెగా పిక్సెల్ రెజల్యూషన్ ఉన్న రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా పొందుపరచబడతాయి. భారీగా 5,500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో Quick Charge 3.0ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Mi Band 3....
Mi Band 3 గురించి చెప్పుకుంటే, IP67 వాటర్ ప్రూఫ్ కలిగిన బ్యాండ్ ఇది. ఒకసారి చార్జింగ్ చేస్తే 20 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. దీంట్లో హార్ట్ రేట్ మానిటర్, పెడోమీటర్, సెడెటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, వెదర్, అలారం వంటి సదుపాయాలు ఉంటాయి.

Mi TV4 ....
అలాగే ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న Mi TV4 మోడల్ కి సంబంధించి 75 అంగుళాల మోడల్ తాజాగా భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.

Mi 360 వైర్లెస్ కెమెరా, air purifier...
వీటితోపాటు అదే రోజు Mi 360 వైర్లెస్ కెమెరా, air purifier కూడా ఇండియాలో విడుదల చేయనుంది


Click it and Unblock the Notifications








