షియోమి ఫోన్లకు MIUI 9 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !
చైనా దిగ్గజం షియోమి తన కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ ఎంఐయూఐ 9ను యూజర్ల కోసం తాజాగా విడుదల చేసింది.
చైనా దిగ్గజం షియోమి తన కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ ఎంఐయూఐ 9ను యూజర్ల కోసం తాజాగా విడుదల చేసింది. గతంలోనే ఈ అప్‌డేట్‌ను బీటా రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి పూర్తి వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు ఈ ఫోన్ అప్ డేట్ పొందే వివరాలను కూడా అందించింది.

ఈ ఫోన్లకే..
షియోమీ ఎంఐ మిక్స్ 2, ఎంఐ 5, ఎంఐ 4, ఎంఐ 4ఐ, ఎంఐ 3, ఎంఐ మ్యాక్స్ 2, ఎంఐ మ్యాక్స్/ప్రైమ్, రెడ్‌మీ నోట్ 4, నోట్ 3, రెడ్‌మీ నోట్ ప్రైమ్, రెడ్‌మీ 4, 4ఎ, రెడ్‌మీ 3ఎస్/ప్రైమ్/ప్లస్, రెడ్‌మీ 2/ప్రైమ్ ఫోన్లను వాడుతున్న యూజర్లు ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

లింక్ ఇదే..
అందుకు గాను యూజర్లు http://en.miui.com/thread-769442-1-1.html వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఇచ్చిన సూచనల మేరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోన్ల అప్‌డేట్ సమాాచారం..
పై లింకులో మీకు ఏ ఫోన్లకు అప్‌డేట్ ఇచ్చారు అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. MIUI 9 అనేక ఆసక్తికర ఫీచర్లతో వచ్చింది.ఆండ్రాయిడ్ 8.0లో ఉండే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సెల్ఫీ కిల్లర్ ఫోన్ మి నోట్ 3
షియోమి నుంచి సెల్ఫీ కిల్లర్ ఫోన్ మి నోట్ 3 నవంబర్ 2న ఇండియాని పలకరించనుంది. షియోమి నుంచి వస్తున్న మొట్టమొదటి సెల్ఫీ కిల్లర్ ఫోన్ కూడా ఇదే..


Click it and Unblock the Notifications








