షియోమీ నుంచి రెండు శక్తివంతమైన పవర్ బ్యాంక్‌లు

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షియోమీ.. 5000 ఎమ్ఏహెచ్, 16000 ఎమ్ఏహెచ్ వేరియంట్‌లలో రెండు శక్తవంతమైన పవర్ బ్యాంక్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 5000ఎమ్ఏహెచ్ మై పవర్ బ్యాంక్ ధర రూ.6,999 కాగా, 1600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల మై పవర్ బ్యాంక్ ధర రూ.1399.

షియోమీ నుంచి రెండు శక్తివంతమైన పవర్ బ్యాంక్‌లు

ఈ పవర్ బ్యాంక్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...16000 ఎమ్ఏహెచ్ మై పవర్ బ్యాంక్ రెండు యూఎస్బీ 2.0 పోర్టులతో పాటు ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను కలిగి ఉటుంది. ఈ పవర్ బ్యాంక్ పరిమాణం 145×60.4×22 మిల్లీ మీటర్లు, బరువు 350 గ్రాములు. పవర్ బ్యాంక్ కన్వర్షన్ రేట్ 93శాతం. కంపెనీ వెల్లడించిన వివరాల మేరకు ఈ పోర్టబుల్ చార్జర్ 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల షియోమీ రెడ్మీ నోట్ 4జీ డివైస్ ను 3.5 సార్లు పూర్తిగా చార్జ్ చేయగలదు.

5000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం మై పవర్ బ్యాంక్ ఒక యూఎస్బీ 2.0 పోర్ట్ అలానే మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. బరువు 156 గ్రాములు. పవర్ బ్యాంక్ కన్వర్షన్ రేట్ 93శాతం.

Best Mobiles in India

English summary
Xiaomi Launches Mi 5000mAh and 16000mAh Power Banks in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X