మరో బంపరాఫర్‌తో దూసుకొచ్చిన షియోమి

By Hazarath
|

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమి మరో బంపరాఫర్‌తో దూసుకొచ్చింది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సరికొత్తగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ఆన్‌లైన్ యూజర్లకు కాదు, ఆఫ్‌లైన్ యూజర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది.

 

ఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండిఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండి

పాత ఫోన్‌ను ఎంఐ హోం స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేస్తే..

పాత ఫోన్‌ను ఎంఐ హోం స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేస్తే..

వినియోగదారులు తాము వాడుతున్న పాత ఫోన్‌ను ఎంఐ హోం స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేస్తే అందుకు లభించే మొత్తంతో కొత్త షియోమీ ఫోన్‌ను డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు షియోమీ క్యాషిఫై అనే సంస్థతో భాగస్వామ్యం అయింది.

ఫోన్ కండిషన్‌ను బట్టి దానికి రేటు..

ఫోన్ కండిషన్‌ను బట్టి దానికి రేటు..

ప్రతి షియోమీ ఎంఐ హోమ్ స్టోర్‌లో క్యాషిఫైకు చెందిన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వారు వినియోగదారుల ఫోన్ కండిషన్‌ను బట్టి దానికి రేటు నిర్ణయిస్తారు. ఆ రేటు ఓకే అనుకుంటే వినియోగదారులు తమ ఫోన్‌ను క్యాషిఫైకి విక్రయించవచ్చు.

పాత ఫోన్‌ను విక్రయిస్తే వచ్చే మొత్తాన్ని..
 

పాత ఫోన్‌ను విక్రయిస్తే వచ్చే మొత్తాన్ని..

దాంతో వచ్చే సొమ్ముతో కొత్త షియోమీ ఫోన్‌ను డిస్కౌంట్‌లో కొనవచ్చు. మరో సౌకర్యం ఏంటంటే ఫోన్‌ను కొనకపోయినా వినియోగదారులు తమ పాత ఫోన్‌ను విక్రయిస్తే వచ్చే మొత్తాన్ని నేరుగా తీసుకోవచ్చు.

ఎంఐ హోమ్ స్టోర్ ఉన్న నగరాల్లో..

ఎంఐ హోమ్ స్టోర్ ఉన్న నగరాల్లో..

ఇందుకు గాను ఎంఐ హోమ్ స్టోర్ ఉన్న నగరాల్లో క్యాషిఫై యూజర్లకు పికప్ సర్వీస్‌ను కూడా అందిస్తున్నది. ఈ సర్వీస్‌ను ఎంచుకుంటే వినియోగదారుడు కోరుకున్న చోటకు క్యాషిఫై ఎగ్జిక్యూటివ్ వచ్చి ఫోన్‌ను తీసుకుని దానికి వచ్చే సొమ్మును చెల్లిస్తాడు.

 షియోమి స్టోర్ మాదాపూర్‌లో..

షియోమి స్టోర్ మాదాపూర్‌లో..

ప్రస్తుతం షియోమీ ఎంఐ హోమ్ స్టోర్‌లు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూనె, చెన్నైల్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో షియోమి స్టోర్ మాదాపూర్‌లో ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Launches Mi Exchange Program in India. Exchange Your Old Phone for a New Xiaomi Smartphone at Mi Home

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X