మార్కెట్లోకి Redmi Y1, Redmi Y1 Lite

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Redmi Y1, Redmi Y1 Lite పేర్లతో లాంచ్ అయిన ఈ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.10,000 ధర సెగ్మెంట్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి..

 

Redmi Y1 స్పెసిఫికేషన్స్..

Redmi Y1 స్పెసిఫికేషన్స్..

5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు :f/2.0 అపెర్చుర్, 76.4 వైడ్ యాంగిల్ లెన్స్, సింగిల్ ఎల్ఈడి సెల్ఫీ లైట్, సెల్ఫీ కౌంట్ డౌన్, ఫేషియల్ రికగ్నిషన్), 13 మెగా పికస్ల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : పీడీఏఎఫ్ సపోర్ట్, లో లైట్ ఎన్‌హాన్స్‌మెంట్, హెచ్‌డీఆర్, రియల్ - టైమ్ ఫిల్టర్స్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్), ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ. గోల్డ్ ఇంకా డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ అందబాటులో ఉంటుంది.

Redmi Y1 Lite స్పెసిఫికేషన్స్..
 

Redmi Y1 Lite స్పెసిఫికేషన్స్..

5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎయిర్‌టెల్ స్టోర్‌లో iPhone X?ఎయిర్‌టెల్ స్టోర్‌లో iPhone X?

Amazonలో ఎక్స్‌క్లూజివ్ సేల్...

Amazonలో ఎక్స్‌క్లూజివ్ సేల్...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. వీటి ధరలను పరిశీలించినట్లయితే Redmi Y1 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.8,999. Redmi Y1 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999. Redmi Y1 Lite ధర రూ.6,999. నవంబర్ 8 నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి. లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ ఫోన్స్ కొనుగోలు పై 280జీబి ఐడియా 4జీ డేటాను యూజర్లు పొందే వీలుంటుంది.

ఇదే ఈవెంట్‌లో భాగంగా షావోమి తన Mi ఫ్యాన్స్ కోసం సరికొత్త MIUI 9 వర్షన్‌ను అనౌన్స్ చేసింది. మిడ్-నవంబర్ నుంచి ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో షావోమి ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నియమితులయ్యారు.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi today announced the launch of a new smartphone series designed around people’s lifestyles with Redmi Y1 and Redmi Y1 Lite.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X