Just In
- 1 hr ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Xiaomi 55, 65, 75-ఇంచ్ Mi 5 సిరీస్ QLED టీవీలు త్వరలో లాంచ్ కానున్నాయి!!
చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి స్మార్ట్‌టీవీలను కూడా తన వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లతో అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఇండియాలో Mi టివి 5 సిరీస్‌ను ప్రారంభించటానికి షియోమి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త టీజర్ సూచిస్తున్నది. షియోమి సంస్థ మీడియా సంస్థలకు పంపిన ఇమెయిళ్ళు మరియు సోషల్ మీడియాలోని కొత్త పోస్టుల ప్రకారం Mi టీవీ 5 ప్రో అల్ట్రా-హెచ్డి క్వాంటం డాట్ ఎల్ఇడి (QLED) స్క్రీన్‌తో 55-ఇంచ్, 65-ఇంచ్ మరియు 75-ఇంచ్ వంటి మూడు పరిమాణాల్లో విడుదల కానున్నాయి.

షియోమి Mi టివి 5 సిరీస్ టీజర్ వివరాలు
షియోమి సంస్థ విడుదల చేసిన కొత్త టీజర్ ఎటువంటి విషయాలను పెద్దగా వెల్లడించనప్పటికీ సింగిల్ ఆపరేటివ్ వర్డ్ Mi టివి 5 ప్రోను సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. కొత్త టీజర్ ప్రకాశవంతమైన సూర్యకాంతితో ఎక్లిప్స్ లిఫ్టింగ్ యొక్క యానిమేషన్‌ను చూపిస్తుంది. ఇందులో అధిక ప్రకాశం మరియు క్వాంటం డాట్ ఎల్ఈడి స్క్రీన్లు సాధారణంగా అనేక కలర్లను చూపుతున్నాయి. ఇందులో లాంచ్ డేట్ ప్రస్తావించనప్పటికీ వీటి యొక్క లాంచ్ 2020 సంవత్సరం ముగిసేలోపు ఉండవచ్చని కమ్యూనికేషన్లు సూచిస్తున్నాయి.

Mi టివి 5 మరియు Mi టివి 5 ప్రో ఇండియా లాంచ్ వివరాలు
Mi టివి 5 మరియు Mi టివి 5 ప్రో రెండు వేరియంట్ టీవీలు 2019 నవంబర్‌లో చైనాలో ప్రారంభించబడ్డాయి. ఇండియాలో కరోనా మహమ్మారి మరియు లాక్డౌన్ల కారణాల వలన ఇంకా విడుదల కాలేదు. లేకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో ఈ Mi 5 సిరీస్ టీవీలు ప్రారంభించబడవచ్చు. ఈ టీవీ సిరీస్ లు సాధారణ Mi టీవీ 5 తో పాటు ప్రో వేరియంట్ రెండింటిలోను 55-అంగుళాలు, 65 అంగుళాలు మరియు 75-అంగుళాల పరిమాణాలు కలిగి ఉన్నాయి. అన్ని టీవీల్లో అల్ట్రా-హెచ్డీ (3840x2160- పిక్సెల్) స్క్రీన్లు ఉన్నాయి. Mi టివి 5 ధర CNY 2,999 (సుమారు రూ .33,800), CNY Mi టివి 5 ప్రో ధర CNY 3,699 (సుమారు రూ. 41,700) వద్ద రిటైల్ అవుతుంది.

Mi 5 సిరీస్ టీవీ ఇండియా ధరల వివరాలు
ఇండియాలో ఈ Mi 5 సిరీస్ టీవీలలో Mi టివి 5 రూ. 39,999 మరియు Mi టివి 5 ప్రో రూ.49,999 కొంచెం ఎక్కువ ధరల వద్ద రిటైల్ అయ్యే అవకాశం ఉంది. Mi టివి 5 మరియు Mi టివి 5 ప్రో మధ్య గల ముఖ్యమైన వ్యత్యాసం విషయానికి వస్తే ప్రో వేరియంట్ క్యూఎల్ఇడి స్క్రీన్‌ను కలిగి ఉండడం. రెండు టీవీల్లోనూ హెచ్‌డిఆర్ సపోర్ట్ ఉండే అవకాశం ఉండడమే కాకుండా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్స్ ప్యాచ్‌వాల్ లాంచర్‌తో పాటు ఆండ్రాయిడ్ టివిలో రన్ అవుతాయి.

Mi 5 సిరీస్ టీవీ స్పెసిఫికేషన్స్ వివరాలు
Mi 5 టీవీ 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వద్ద Mi 5 ప్రో టీవీ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వద్ద లభించనున్నాయి. భారతదేశంలో మిగిలిన సంస్థలు అందించే ప్రీమియం స్మార్ట్ టీవీల దానికంటే ఇవి మెరుగ్గా ఉన్నాయి. భారతదేశంలో షియోమి ప్రారంభించనున్న అత్యంత ప్రీమియం టెలివిజన్లు ఇవే కావడం మరొక విశేషం. ఇండియాలో షియోమి సంస్థ ఇప్పటివరకు Mi టివి 4X సిరీస్ టీవీలు అత్యంత ఖరీదైన టివి సిరీస్ లో ఉన్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190