Home
News

RRR మూవీ బడ్జెట్ 400 కోట్ల మార్కును దాటిన Mi 10i సేల్స్!! అది కూడా 3 వారాలలోనే..

షియోమి సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో Mi 10 సిరీస్‌లోని తాజా చేరికలో గత నెలలో విడుదల అయిన Mi 10i 5G ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో ఇటీవల ప్రారంభం అయ్యాయి. షియోమి ఇటీవల తన యొక్క ట్విటర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకారం Mi 10i 5G మార్కెట్లోకి వచ్చిన కేవలం మూడు వారాల్లోనే RRR సినిమా యొక్క బడ్జెట్ 400 కోట్ల రూపాయల అమ్మకాలను దాటింది.

షియోమి Mi 10i 5G

మిడ్-రేంజ్ విభాగంలో అధునాతన 5G ఫీచర్లతో లభించే ఈ ఫోన్ యొక్క అమ్మకాలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. షియోమి సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 5, 2021 న ఇండియాలో విడుదల చేసింది. అలాగే జనవరి 7 న అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం మరియు తరువాత జనవరి 8, 2021 న ఓపెన్-సేల్ పద్దతిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మిడ్-రేంజ్ విభాగంలోని 5G ఫోన్ల పోటీలో గెలుపొందిన షియోమి Mi 10i 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల గురించి పరిశీలించడానికి ముందుకు చదవండి.

Mi 10i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

Mi 10i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

షియోమి సంస్థ ఇండియాలో Mi 10i స్మార్ట్‌ఫోన్ ని మూడు వేరు వేరు ర్యామ్ / స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో 6GB ర్యామ్+ 64GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.20,999. అలాగే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 21,999 కాగా చివరిది 8GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఈ స్మార్ట్‌ఫోన్ ను జనవరి 8 నుండి అమెజాన్ ఇండియా మరియు Mi.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

Mi 10i స్మార్ట్‌ఫోన్ 108 MP కెమెరా సెటప్

Mi 10i స్మార్ట్‌ఫోన్ 108 MP కెమెరా సెటప్

షియోమి Mi 10i యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది.

Mi 10i MIUI 12 ఆండ్రాయిడ్ ఫీచర్స్

Mi 10i MIUI 12 ఆండ్రాయిడ్ ఫీచర్స్

షియోమి Mi 10i కొత్త ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. ఈ పరికరం కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,820mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12 తో రన్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi 10i Smartphone Sales Cross 400 Crore Mark in Just 3 Weeks
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X