Home
News

Android 11 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించిన Mi 10T, Mi 10T ప్రో స్మార్ట్‌ఫోన్‌లు

భారతదేశంలో షియోమి యొక్క Mi 10T, Mi 10T ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండు ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. షియోమి యొక్క ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12 తో ప్రారంభించబడ్డాయి. ఈ ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ జనవరి 2021 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో పాటు వస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత రన్ అవుతూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అలాగే ఇవి అధిక రిఫ్రెష్ రేట్‌ గల డిస్ప్లేలను కలిగి ఉండి 128GB స్టోరేజ్‌/ 8GB ర్యామ్‌ను కలిగి ఉంటాయి.

Mi 10T & 10T ప్రో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌

Mi 10T & 10T ప్రో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌

ఇండియాలో Mi 10T, Mi 10T ప్రో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారు MIUI 12.1.1.1 ఆండ్రాయిడ్ 11 ఆధారిత అప్‌డేట్‌ను స్వీకరించినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. బిల్డ్ నంబర్ 12.1.1.0 RJDINXMతో ఆండ్రాయిడ్ 11 కాకుండా, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ సిస్టమ్ భద్రతను పెంచడానికి జనవరి 2021 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం స్థిరమైన బీటా రూపంలో ఉందని నివేదికలు చూపుతున్నాయి. దీని యొక్క తుది రోల్‌అవుట్‌కు ముందు పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అప్‌డేట్‌ను అందివ్వనున్నట్లు షియోమి సంస్థ తెలిపింది.

షియోమి Mi 10T సిరీస్ స్పెసిఫికేషన్స్

షియోమి Mi 10T సిరీస్ స్పెసిఫికేషన్స్

షియోమి Mi 10T స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ ట్రూ కలర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ HDR10 +, FHD + రిజల్యూషన్, DCI-P3 కలర్ మరియు 1120nits గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఇది మైక్రోడాట్-నాచ్డ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. అలాగే దీని యొక్క డిస్ప్లే 5000000: 1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5G మద్దతును కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ మరియు అడ్రినో 650 జిపియుతో జతచేయబడి ఉంటుంది. ఇది వేడిని వెదజల్లడానికి లిక్విడ్ కూల్ 2.0 ఆవిరి ఛాంపర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

షియోమి Mi 10T సిరీస్ కనెక్టివిటీ

షియోమి Mi 10T సిరీస్ కనెక్టివిటీ

షియోమి Mi 10T స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జిపిఎస్, హై-రెస్ ఆడియో, NFC మరియు ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. Mi 10T 30W వైర్డ్ టర్బో ఛార్జ్ టెక్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. ఇది హోమ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లకు సమానమైన వై-ఫై 6 కి మద్దతును అందిస్తుంది. ఇది వై-ఫై 802.11ac యొక్క అప్ డేట్ వెర్షన్.

షియోమి Mi 10T సిరీస్ కెమెరా సెటప్ ఫీచర్స్

షియోమి Mi 10T సిరీస్ కెమెరా సెటప్ ఫీచర్స్

షియోమి Mi 10T స్మార్ట్‌ఫోన్ యొక్క అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి దాని రియర్ కెమెరా సెటప్. ఈ ఫోన్ యొక్క వెనుకవైపు మొత్తంగా నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా శామ్సంగ్ యొక్క ఐసోసెల్ బ్రైట్ హెచ్‌ఎంఎక్స్ సెన్సార్‌తో 108 మెగాపిక్సెల్ తో వస్తుంది. దీని రియర్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS, EIS సెన్సార్‌ల మద్దతు కూడా ఉన్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియోల కోసం 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ప్రో వీడియో రికార్డింగ్ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, రా మోడ్ వంటి మరెన్నో ఫీచర్లను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi 10T & 10T Pro Smartphones Start Receiving Android 11 Update
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X