షియోమి Mi 11 లైట్ వివరాలు లీక్ అయ్యాయి!! మీరు ఓ లుక్ వేయండి

|

ప్రముఖ షియోమి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇండియాలో జూన్ 22 న తన యొక్క కొత్త స్మార్ట్ ఫోన్ Mi 11 లైట్ ను విడుదల చేయనున్నది. అయితే ఇండియా లాంచ్‌కు ముందే Mi 11 లైట్ యొక్క కలర్ వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ ను ఇండియాలో మూడు కలర్ వేరియంట్ లలో లాంచ్ చేయనున్నది. ఈ మూడు కలర్ ఆప్షన్ల వివరాలను షియోమి ఇండియా యొక్క ట్విట్టర్‌లో వెల్లడించింది. సంస్థ యొక్క ట్విట్టర్ లో ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను మరియు మూడు కలర్ వేరియంట్ లను చూపించే ఒక చిన్న వీడియోను విడుదల చేసింది.

 

Mi11 లైట్

Mi11 లైట్ ఫోన్ ను ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో 4G మరియు 5G వేరియంట్లలో మార్చిలో లాంచ్ చేశారు. అయితే ప్రస్తుతానికి 4G వేరియంట్ మాత్రమే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని యొక్క పేరుకు తగ్గట్లుగా Mi11 లైట్ అనేది Mi 11 యొక్క టోన్-డౌన్ వెర్షన్. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Disney + Hotstar సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడం ఎలా?Disney + Hotstar సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడం ఎలా?

 

షియోమి Mi 11 లైట్ ట్వీట్

షియోమి సంస్థ తన Mi 11 లైట్ ఫోన్ ను జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, మరియు వినైల్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్ లలో విడుదల చేయనున్నట్లు షియోమి ఇండియా యొక్క ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ ద్వారా విడుదల చేసింది. ఈ మూడు కలర్ లు వరుసగా మ్యూజిక్ జెనెరిక్, ఇటలీలోని ఒక ప్రాంతం మరియు ఫోనోగ్రాఫిక్ రికార్డుల ద్వారా ప్రేరణ పొందాయి అని సంస్థ తెలిపింది. ఫోన్ యొక్క కలర్ లను ఒక వీడియో ద్వారా చూపారు. ఈ వీడియోలో మూడు కలర్ ఎంపికలలో ఫోన్ వెనుక ప్యానెల్ను కూడా చూపిస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు చూపుతున్నది. Mi 11 లైట్ ఫోన్ జూన్ 22 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ కానున్నది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది. అయితే సేల్స్ వివరాలను లాంచ్ రోజున ప్రకటించే అవకాశం ఉంది.

Mi 11 లైట్ ఇండియా ధరల వివరాలు

Mi 11 లైట్ ఇండియా ధరల వివరాలు

షియోమి సంస్థ తన Mi 11 లైట్ ఫోన్ యొక్క 6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ను సుమారు రూ. 26,600 ధర వద్ద లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనితో పాటుగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దాని ధర అస్పష్టంగానే ఉంది.

Mi 11 లైట్ స్పెసిఫికేషన్స్

Mi 11 లైట్ స్పెసిఫికేషన్స్

Mi 11 లైట్ ఫోన్ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90HZ రిఫ్రెష్ రేట్ మరియు HDR10 మద్దతును కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G SoC చేత శక్తిని కలిగి ఉండి ఇది 6GB LPDDR4X RAM మరియు 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. Mi 11 లైట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు F / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి . అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.45 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

Mi 11 లైట్ కనెక్టివిటీ

Mi 11 లైట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై, 4G, బ్లూటూత్ V5.1, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. మి 11 లైట్ 4 జిలో సెన్సార్లలో సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, లీనియర్ మోటర్ మరియు ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఫోన్ 4W2, 4W2mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇది 160.53x75.73x6.81mm కొలతల పరిమాణంతో కేవలం 157 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Mi 11 Lite India Launch Date Revealed: Leaks Colour Options, Expect Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X