Home
News

Xiaomi నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!! లాంచ్ డేట్, ఫీచర్స్ ఇదిగో...

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి ఇండియాలోని మొబైల్ మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నది. ఈ సంస్థ ఎప్పుడు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు ఆకర్షిస్తున్నది. ఇప్పుడు కూడా Mi 11 ప్రో మరియు Mi11 అల్ట్రా పేరుతో Mi 11 సిరీస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. వీటిని చైనాలో మార్చి 29, సోమవారం రాత్రి 7:30 గంటలకు CST (సాయంత్రం 5 గంటలకు IST) లో విడుదల చేయనున్నట్లు షియోమి కంపెనీ ప్రకటించింది.

షియోమి Mi 11 సిరీస్‌ మెగా లాంచ్ ఈవెంట్‌

షియోమి Mi 11 సిరీస్‌ మెగా లాంచ్ ఈవెంట్‌

షియోమి యొక్క కొత్త లాంచ్ గురించి సంస్థ తన యొక్క అధికారిక ట్విట్టర్ ద్వారా ‘మెగా లాంచ్' పేరుతో ఈవెంట్‌కు సంబందించిన వివరాలను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ కు సంబందించిన కార్యక్రమం గురించి వీబోలో పోస్టర్ ను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్ల గురించి ఇటీవల చాలా వార్తలు పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లలో Mi 11 లైట్ వేరియంట్ యొక్క మూడవ మోడల్‌ను విడుదల చేయడం గురించి షియోమి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఈ చైనా కంపెనీ వీటిని క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888, హోల్-పంచ్ డిజైన్, మరియు 2K డిస్‌ప్లే వంటి ఫీచర్లతో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి కొత్త లాంచ్ ఆన్‌లైన్ ఈవెంట్ పోస్టర్

షియోమి కొత్త లాంచ్ ఆన్‌లైన్ ఈవెంట్ పోస్టర్

షియోమి సంస్థ వీబోలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ప్రకారం కంపెనీ చైనాలో మార్చి 29 న Mi 11 అల్ట్రా మరియు Mi11 ప్రో లాంచ్ లను CST సాయంత్రం 7:30 గంటలకు (సాయంత్రం 5 గంటలకు IST) లో షెడ్యూల్ చేయనుంది. ఇది ఆన్‌లైన్ ఈవెంట్ కావున ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌తో సహా షియోమి యొక్క సోషల్ మీడియా ఛానెల్‌లలో లైవ్ అందివ్వనున్నది. షియోమి సంస్థ ఇంతకుముందు లాంచ్ ఈవెంట్‌లను కూడా తన యొక్క అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి వినియోగదారులను ఆహ్వానించింది.

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

షియోమి సంస్థ సంస్థ కొత్తగా విడుదల చేసే Mi11 అల్ట్రా ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఇటీవల ఇండోనేషియాలో ధృవీకరణ కూడా లభించినట్లు సంస్థ తెలిపింది. అలాగే దీనిని హ్యాండ్-ఆన్ వీడియోలో కూడా చూపడం జరిగింది. ఇది కంపెనీ Mi 11 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్‌గా యూజర్ల ముందుకు రానున్నది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 67W వైర్డ్ ఛార్జింగ్ తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు పుకారు ఉంది. దీని స్పీకర్లు హర్మాన్ కార్డాన్ ట్యూన్ చేసినట్లు చెబుతారు. ఇది IP68 డస్ట్ మరియు నీటి నిరోధకతతో రావచ్చు మరియు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంటుంది.

Mi 11 ప్రో స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

Mi 11 ప్రో స్పెసిఫికేషన్స్ (ఊహించిన)

Mi 11 ప్రో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే అల్ట్రా యొక్క అదే ఫీచర్లలో కొన్ని మార్పులను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో పెరిస్కోప్ లెన్స్‌తో 120x జూమ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు కొన్ని లీక్ లు సూచిస్తున్నాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో ఒక ఫోటోను టిప్‌స్టర్ షేర్ చేసింది. దీనిని నిశితంగా పరిశీలిస్తే కనుక ఫోన్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు పెరిస్కోప్ లెన్స్ క్రింద 120x బ్రాండింగ్‌తో చూపుతున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi 11 Ultra, Mi 11 Lite and Mi 11 Pro New Phones Global Mega Event Launch Date Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X