హాక్ కేకుల్లా అమ్ముడుపోయిన షియోమీ ఎంఐ 5ఎక్స్!

మొదటి ఫ్లాష్ లో 300,000యూనిట్లు సేల్

By Madhavi Lagishetty
|

ఛైనా మొబైల్ దిగ్గజం షియోమీ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. షియోమీ ఎంఐ 5ఎక్స్ మొదటి ఫ్లాష్ సేల్ లోనే 300,000యూనిట్లు అమ్ముడుపోయాయి.

300,000 units of Xiaomi Mi 5X sold in first flash sale

షియోమీ ఎంఐ5ఎక్స్ , MIUI 9లను జూలైలో విడుదల చేశారు. అదే సమయంలో షియోమీ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 1న చైనాలో ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

షియోమీ ఎంఐ 5ఎక్స్ మంగళవారం మాతృభూమిలో అమ్మకాలు జరిపిం. షియోమీ కో ఫౌండర్ లిన్ బిన్ మొదటి విక్రయంలోనే ఎంఐ 5ఎక్స్ దాదాపు 300,000యూనిట్లు విక్రయించినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన వు యిఫాన్ ధన్యవాదాలు తెలిపారు. ఎంఐ 5ఎక్స్ గులాబీ,గోల్డ్ వేరియంట్ లో అత్యధిక అమ్మకాలు జరిగాయని వెల్లడించారు.

ఐఫోన్8 రిలీజ్ డేట్ వచ్చేసింది!ఐఫోన్8 రిలీజ్ డేట్ వచ్చేసింది!

ఎంఐ 5ఎక్స్ మొదటి ఫ్లాష్ అమ్మకాలు ముగిసినట్లు తెలిపారు. తర్వాత ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన షియోమీ బెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంఐ 6లో కనిపించే మెయిన్ కెమెరా సెన్సార్లను ఉపయోగించారు.

షియోమీ ఎంఐ 5ఎక్స్ ప్రధాన ఫీచర్లు...5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ,1080పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్ ప్లే. క్వాల్కమ్, స్నాప్ డ్రాగెన్ 625 SoCని వినియోగిస్తుంది. 4జిబి ర్యామ్,64జిబి స్టోరేజీ కెపాసిటిని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 3080mAhబ్యాటరీని ఉపయోగించుకుంటుంది. మొదటి MIUI 9 బూట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ నూగట్ ఆధారంగా పనిచేస్తుంది.

బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్స్ లో షియోమీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర 14,000 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
It has been revealed that the Xiaomi Mi 5X has crossed over 300,000 units in the first flash sale. Read more...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X