ఆగస్టులో షియోమీ MI 6 రిలీజ్!

By: Madhavi Lagishetty

చైనాకు చెందిన మొబైల్ తయారుదారి షియోమీ తన ఎంఐ5x స్మార్ట్ ఫోన్ తో పాటు MIUI 9 ROMను బుధవారం విడుదల చేసింది. వీటితో పాటు MI AI స్పీకర్ ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

ఆగస్టులో షియోమీ MI 6 రిలీజ్!

ఎంఐ6 సిల్వర్ వేరియంట్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు షియోమీ సీఈవో లీ జున్ తెలిపారు. ఎంఐ 6 సిల్వర్ వేరియంట్ తో పాటు ఇతర కలర్స్ లోనూ ఏప్రిల్ లో విడుదల చేసింది. అయితే మార్కెట్లో ఎంఐ 5 విఫలమైందన్నారు.

షియోమీ ఎంఐ 6 సిల్వర్ ఎడిషన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కెపాసిటితో విడుదల కానుంది. 38,100ధరతో ఈ ఫోన్ వినియోగదారులకు ఆగస్టు 3వ తేదీ నుంచి లభ్యం కానుంది. పరిమిత సంఖ్యలోనే ఎంఐ 6 ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇక షియోమీ ఎంఐ 6 సిల్వర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్ లో తయారు చేశారు. స్టేయిన్ లెస్ స్టీల్ తోపాటు ..పూర్తిగా గ్లాస్ తో కవర్ అయి ఉంటుంది. ప్రత్యేక ఆల్ట్రా-రిఫ్లేక్టివ్ మిర్రర్ ను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. మిగత హ్యండ్ సెట్స్ కన్నా సిల్వర్ ఎడిషన్ కు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది. ఎం ఐ 6 సిల్వర్ ఎడిషన్ 6శాతం ప్రొడెక్షన్ తక్కువగా ఉన్నట్లు సీఈవో లీ జున్ తెలిపారు.

Read more about:
English summary
It has been announced that only 100 units of the Xiaomi Mi 6 Silver edition will be made available and the sale will happen on August 3.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot