8జీబి ర్యామ్‌తో Xiaomi Mi 7..?
2018కు గాను షావోమి బ్రాండ్ నుంచి లాంచ్ కాబోతోన్న శక్తికవంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో Xiaomi Mi 7 ఒకటి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రాబోతోన్న మొట్టమొదటి చైనా బ్రాండెడ్
స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

హై-ఎండ్ ఫీచర్లతో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో అండర్ - గ్లాస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా 3డీ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్ ఐడీ ఫీచర్ తరహాలోనే ఓ ప్రత్ర్యేకమైన 3డీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని షావోమి అభివృద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ ఫోన్‌కు సంబంధించి తాజాగా లీకైన పలు ఇమెజెస్ ప్రకారం Mi 7 స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ డిజైనింగ్‌తో రాబోతోంది. ఫుల్ స్ర్కీన్ డిజైన్, 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే, పలుచటి బీజిల్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత క్లాసికల్‌గా తీర్చిదిద్దాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








