ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో Xiaomi Mi 7

By: BOMMU SIVANJANEYULU

షావోమి నుంచి 2018 మొదటి క్వార్టర్‌లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఎంఐ 7 (Mi 7) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ చేసిన డ్యుయల్ రేర్ కెమెరాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ఎక్విప్ అయి ఉండే అవకాశం ఉందని చూచాయిగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఎంఐ 7 ఫోన్ నుంచి అత్యుత్తమ ఫోటోగ్రఫీని ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆశించవచ్చు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో  Xiaomi Mi 7

చైనాలో జరుగుతోన్న వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా షావోమి సీఈఓ లీ జున్ పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. 2018లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నలజీ పై తాము పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే షావోమి నుంచి లాంచ్ కాబోతోన్న
స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ టెక్నాలజీతో పనిచేసే అవకాశముందని స్పష్టమవుతోంది.

రూమర్స్ మిల్స్ ద్వారా తెలుస్తోన్న వివరాల ప్రకారం ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్, క్వాల్కమ్ తరువాతి వర్షన్ మొబైల్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 845 సాక్ పై రన్ అవ్వబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సపోర్ట్‌తో రాబోతోన్న మొట్టమొదటి షావోమి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావొచ్చన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.

ఎయిర్‌టెల్ ప్లాన్లలో మార్పు, డేటా పరిమితి పెంపు !

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎంఐ 7 ఆఫర్ చేసే ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ మేట్ 10, మేట్ 10 ప్రో తరహాలో ఉండచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హువావే బ్రాండ్ నుంచి లాంచ్ అయిన ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఏఐ అసిస్టెడ్ కైరిన్ 970 చిప్‌సెట్ పై రన్ అవుతున్నాయి. తక్కువ వెళుతురులోనూ హై-క్వాలిటీ ఫోటోగ్రఫీని ఈ రెండు ఫోన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ 12 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్380 సెన్సార్ + 20 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్350 సెన్సార్ కాంభినేషన్‌లో ఉండొచ్చని ఓ అంచనా. 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 6.01 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ రాబోతోన్నట్లు తెలుస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోన్న మొట్టమొదటి షావోమి ఫోన్ కూడా ఇదే కావొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషించికుంటున్నాయి.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌ను డిసెంబర్ 7న యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ
చిప్‌సెట్‌ను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9తో పాటు ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించనున్నారు. స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌ను వినియోగించుకుంటోన్న మొట్టమొదటి చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమి నిలవబోతోంది. చైనా మార్కెట్లో ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,000 వరకు ఉండొచ్చని అంచనా.

Read more about:
English summary
Xiaomi Mi 7 is rumored to sport a dual rear cameras with AI capabilities to render an impressive low light performance.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting