2018లో Xiaomi లాంచ్ చేసే మొదటి ఫోన్ ఏంటో తెలుసా?

|

ఈ ఏడాదికిగాను అవసరమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను Xiaomi ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. వీటిలో చాలా వరకు మోడల్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. 2017 ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో 2018లో లాంచ్ కాబోయే మొదటి షియోమీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మార్కెట్లో వాడివేడి చర్చ నడుస్తోంది. షియోమీ అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటైన Mi 7 లాంచ్‌కు సంబంధించి, తాజాగా కొంత సమాచారం ఇంటర్నెట్‌లో స్పెకులేట్ అవుతోంది.

Xiaomi Mi 7 likely pegged for February 2018 launch

GizChina పోస్ట్ చేసిన పలు రిపోర్ట్స్ ప్రకారం షియోమీ అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Mi 7, 2018లో ఆ బ్రాండ్ నుంచి లాంచ్ కాబోయే మొదటి స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus 6కు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముందట. ఈ రెండు ఫోన్‌లను అదే నెలలో జరిగే 2018 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.

షియోమీ Mi 7కు సంబంధించి గతంలో రివీల్ అయిన కొన్ని వివరాల ప్రకారం.. ఈ ఫోన్ Qualcomm Snapdragon 845 SoC పై రన్ అవుతుంది. క్వాల్కమ్ ఆఫర్ చేస్తోన్న మొబైల్ చిప్‌సెట్‌లలో ఇదే లేటెస్ట్. Mi 7కు సంబంధించిన మొదటి టెస్టింగ్ ప్రాసెస్ ఈ ఏడాది నవంబర్‌లోనూ, ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్ 2018, ఫిబ్రవరిలోనూ జరుగుతుందని సమాచారం.

అనధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం.. షియోమీ ఎంఐ 7, 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన అతిపెద్ద OLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఫోన్ డిస్‌ప్లే పై ఎక్కడ ప్రెస్ చేసినా ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివేట్ అయ్యే విధంగా in-display fingerprint sensor వ్యవస్థను ఫోన్ ముందు భాగంలో ఎక్విప్ చేసినట్లు తెలుస్తోంది.

గూగుల్ బడ్స్‌తో ఏకంగా 40 భాషల్లో సంభాషించవచ్చుగూగుల్ బడ్స్‌తో ఏకంగా 40 భాషల్లో సంభాషించవచ్చు

షియోమీ Mi 7కు జూనియర్ వర్షన్ అయిన Mi 6 కొద్ది నెలల క్రితమే చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లభ్యమవుతోన్న ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... ఫోర్ సైడెడ్ 3డీ గ్లాస్ డిజైన్, 5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్ ఫేస్, స్నాప్‌డ్రాగన్ 835 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.45GHz), అడ్రినో 540 జీపీయూ, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ కనెక్టువిటీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 2.2 డ్యుయల్ వై-ఫై టెక్నాలజీ, బ్లుటూత్, NFC.64జీబి వేరియంట్ ధర 2,499 Yuan (మన కరెన్సీలో రూ.23,436), 128జీబి వేరియంట్ ధర 2,899 Yuan (మన కరెన్సీలో రూ.27,172).

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi 7, the upcoming flagship smartphone is likely rumored to be launched in February 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X