2018లో రిలీజ్ కానున్న షియోమీ ఎంఐ7, ఎంఐ7ప్లస్!

By Madhavi Lagishetty
|

షియోమీ నుంచి 2018 ఫస్ట్ క్వార్టర్స్ లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఎంఐ7, ఎంఐ7 ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

 
2018లో రిలీజ్ కానున్న షియోమీ ఎంఐ7, ఎంఐ7ప్లస్!

షియోమీ సీఈవో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. త్వరలో రాబోయో ఫ్లాగ్ షిప్ ఎంఐ 7 స్నాప్ డ్రాగెన్ ఉపయోగించే 845 Socకూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రొసెసర్ ఫీచర్, చైనీస్ మొదటి స్మార్ట్ ఫోన్ లా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక చైనీస్ వెబ్ సైట్ mydrivers నుంచి gizmochina ద్వారా ఎంఐ7 గురించి లెటెస్ట్ న్యూస్ అందించింది. ఎంఐ7 రెండు పరిమాణాల్లో లాంచ్ అవుతుందని...రెండూ ఒకేసారి లాంచ్ కానున్నట్లు వెబ్ సైట్లో పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్ లో షియోమీ ఎంఐ6ను లాంచ్ చేశారు. ఈ డివైస్ ప్రారంభానికి ముందు, సంస్థ ఎంఐ6ప్లస్ ను విడుదల చేస్తుందనే రూమర్స్ వచ్చాయి. అయితే షియోమీ స్నాప్ డ్రాగెన్ లేకపోవడం కారణంగా...షియోమీ ఎంఐ 6 ప్లస్ వేరియంట్ను ప్రారంభించలేకపోయారు. వచ్చే ఏడాది ఎంఐ 7ప్లస్ మరియు ఎంఐ7 ను ఒకే వేదికపై విడుదల చేసేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

ఇక రూమర్స్ ద్వారా తెలుస్తోన్న వివరాల ప్రకారం ఎంఐ 7 స్మార్ట్ ఫోన్, 5.65అంగుళాల డిస్ల్పేతో రానుంది. అయితే ప్లస్ వేరియంట్ 6.01 అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంది. రెండు డిస్ల్పేలు 18:9 యాస్పెక్ట్ రేషియోతో డిస్ల్పే మరియు ఫుల్ స్క్రీన్ డిజైన్ కలిగి ఉంటాయి. ఎంఐ7 ప్లస్లో 3500ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీ, ఎంఐ7లో 3200ఎంహెచ్ బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.

షియోమి ఎలక్ట్రిక్ కార్లు దూసుకొస్తున్నాయ్ !షియోమి ఎలక్ట్రిక్ కార్లు దూసుకొస్తున్నాయ్ !

షియోమీ స్మార్ట్ ఫోన్లు ఈ డివైసులకు ప్రీమియం రూపాన్ని అందిస్తాయి. అంతేకాదు వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టుతో రాబోతున్న మొట్టమొదటి షియోమీ ఫోన్ కూడా ఇదే కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

స్నాప్ డ్రాగెన్ 845 సాక్ పైన రన్ అవ్వబోతుంది. 6జిబి ర్యామ్ తో జతచేయబడిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఎంఐ 6 వలే...ఈ స్మార్ట్ ఫోన్లు సోనీ imx380మరియుimx350 సెన్సార్లతో బోర్డు మీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంటాయి. Ai టెక్నాలజీతో ఎక్విప్ అయి ఉండే అవకాశం ఉంది. అయితే ఎంఐ 7 ఫోన్ నుంచి అత్యుత్తమ ఫోటోగ్రఫీ ఎక్స్ పీరియన్స్ ను యూజర్లు ఆశించవచ్చు.

షియోమీ ఎంఐ కోసం క్వాల్కమ్ యొక్క తాజా చిప్ సెట్ తగినంత స్టాక్ కొనుగోలు చేస్తుందని భావిస్తున్నారు. ఎంఐ7, ఎంఐ7ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకానికి రోలింగ్ సమస్య ఉంటుంది . కాబట్టి ఎంఐ 7 ధర 2699యువాన్(సుమారు 26,000రూపాయలు) ఎంఐ7ప్లస్ 2999యువాన్(సుమారు 29,999రూపాయలు)ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi 7 and Mi 7 Plus are expected to be launched at the same time in March next year.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X