ఆ ఫోన్ ధర రూ.1000 తగ్గింది!

Posted By: Madhavi Lagishetty

షియోమీ....ఇప్పుడు ఇండియాలో మొబైల్ మార్కెట్ ను శాసిస్తుంది. కొత్త కొత్త డివైజులను భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ...కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది. అయితే షియోమీ నుంచి వచ్చిన మొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ ఎంఐ ఏ1 ధరను తగ్గించింది. ఇండియాలో వెయ్యి రూపాయలు తగ్గిస్తూ...ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 13,999రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర 14,999రూపాయలు.

ఆ ఫోన్ ధర రూ.1000 తగ్గింది!

షియోమీ సెప్టెంబర్లో ఈ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేసింది. సంస్థ యొక్క పాపులర్ ఫోన్లలో ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ ఒకటి. అయితే షియోమీ ఎంఐ ఏ1 ధరను తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్ట్ మనుకూమార్ జైన్ ప్రకటించారు.

అతను తన ట్విట్టర్ ద్వారా ఈ వార్తను తెలిపారు. షియోమీ అభిమానులకు గ్రేట్ న్యూస్. ఎంఐ ఏ1 వెయ్యిరూపాయలు తగ్గిస్తున్నాం. కొత్త ధరతో షియోమీ ఎంఐ ఏ1....mi.com మరియు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కేవలం ధర తగ్గింపే కాదు...ఫ్లిప్ కార్ట్ ద్వారా షియోమీ ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే యూజర్లు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే...ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ నెలవారీ 1,556రూపాయల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇ-కామర్స్ పోర్టల్ ద్వారా భవిష్యత్ లో ఫ్లిప్ కార్ట్ లో కొత్త ఫోను కొనుగోలు చేసేందుకు ఎక్స్ చేంజ్ చేసినట్లయితే యూజర్లకు buybackఆఫర్ తో 99రూపాయలు అందిస్తుంది.

ఇక షియోమీ ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ గురించి చర్చించినట్లయితే...5.5 అంగుళాల పూర్తి హెచ్డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625 ప్రొసెసర్ స్మార్ట్ ఫోన్తో పాటు 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మైక్రో ఎస్డి కార్డు ద్వారా 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

భారీగా తగ్గిన గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ ధర

ఆప్టిక్స్ కొరకు హ్యాండ్ సెట్ రెండు 12 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో డ్యుయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇందులో f/2.2 ఎపర్చర్ మరియు 1.25 మైక్రో పిక్సెల్ సైజ్ కలిగి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. టెలిఫోటో లెన్స్ 1మీట్రిన్ పిక్సెల్ సైజ్ మరియు f/2.6 ఎపర్చర్ కలిగి ఉంటుంది. కెమెరా సెన్సార్ 5మెగాపిక్సెల్ సెవరల్ మెడ్స్ తో ఉంటుంది.

షియోమీ ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ 3080 ఎంహెచ్ బ్యాటరీతో సపోర్టుతో రన్ అవుతుంది. స్టాక్ ఆండ్రాయిడ్ పై నడుస్తుంది. 7.1.2నౌగట్ తోపాటు పైలెట్ ఆండ్రాయిడ్ 8.0 ఓరెయో కు బీటా టెస్టులకు రిక్రూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్ 4జి వోల్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై 802.11ac. gps/a-gps,usb టైప్-సి మరియు 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివీ ఆప్షన్స్ అందిస్తుంది. సెన్సార్స్ ఆన్ బోర్డ్ లో కంపాస్ మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సర్, యాక్సిలెరోమీటర్, లైట్, సెన్స్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. 155.40 x 75.80 x 7.30ఎత్తు, వెడల్పు, మందంతోపాటు 168.00 గ్రాముల బరువు ఉంటుంది.

English summary
Manu Kumar Jain, Xiaomi India's Managing Director has now announced that Xiaomi Mi A1 is now getting a permanent price cut of Rs. 1,000 in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot