షియోమి ఫోన్ పేలుడు కలకలం,ఈ సారి ఎంఐ ఏ1 వంతు
ఈ మధ్య స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ను అలాగే ఛార్జింగ్ స్పీడ్ అయ్యే టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు.
ఈ మధ్య స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ను అలాగే ఛార్జింగ్ స్పీడ్ అయ్యే టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. అదే ఇప్పుడు శాపంగా మారుతుంది. ఎందుకంటే తాజాగా షియోమి ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ పేలడం కల కలం రేపుతోంది . అయితే అదృష్టవ శాత్తు ఎవరికీ ఏమి కాలేదు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...

ఈ సంఘటన చైనా లో చోటు చేసుకుంది....
ఈ సంఘటన చైనా లో చోటు చేసుకుంది. నిదురించే సమయం లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకొని ఉండగా ఫోన్ నుంచి పొగలు రావడం ప్రారంభం అయింది. అయితే ఆ ఫోన్ ప్రొటెక్టీవ్ షెల్ లో ఉండడంతో సదరు ఓనర్ కి ఏమి కాలేదు. ప్రొటెక్టీవ్ కేసింగ్ ఆ పేలుడు ప్రభావాన్ని అదుపు చేయగలిగింది.

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు
ఈ నేపథ్యంలో ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

overheat...
ఫోన్‌లో అవసరంలేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌ను బ్రౌజ్....
3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్...
ఫోన్‌లో అవసరంలేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం....
ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లను...
నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

చార్జ్ అవుతోన్న సమయంలో....
ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

ఎక్కువ సేపే గేమ్స్...
ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








