షియోమి Mi బ్యాండ్ 4 ఫ్లాష్ సేల్స్.... ధర ఎంతో తెలుసా!!

|

షియోమి Mi బ్యాండ్ 4 ఈ రోజు మధ్యాహ్నం 1:00 గంటకు ఇండియాలో ఫ్లాష్ అమ్మకాలకు సిద్ధంగా ఉంది. దీనిని అమెజాన్ ఇండియా మరియు Mi ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. షియోమి ఇటీవల తన తాజా ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ఈ నెల మొదటి వారంలో ప్రారంభించింది. Mi బ్యాండ్ 4 మొదట చైనాలో ప్రారంభించబడింది. ఇది Mi బ్యాండ్ 3 ఫిట్‌నెస్ ట్రాకర్‌కు అప్డేట్ వర్షన్ గా వచ్చింది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

షియోమి Mi బ్యాండ్ 4 సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, పెద్ద బ్యాటరీ, కలర్ AMOLED డిస్ప్లే వంటి ఫీచర్ లను కలిగి ఉంది. దీని ధర ఇండియాలో 2,299 రూపాయలు. Mi బ్యాండ్ 4 బ్లాక్, బ్లూ, మెరూన్ మరియు ఆరంజ్ వంటి నాలుగు కలర్ లలో అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ ఫెస్టివల్ షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటించండి

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

Mi బ్యాండ్ 4 0.95-అంగుళాల కలర్ AMOLED 2.5D టచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 x 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టచ్ డిస్ప్లే Mi బ్యాండ్ 3 లో ఉన్నదానికంటే 39.9 శాతం పెద్దది. కొత్తగా ప్రారంభించిన Mi బ్యాండ్ 4 ఇంతక మునుపు మీరు Mi బ్యాండ్ 3 ని కొనుగోలు చేసిన అన్ని ధరల పట్టికలకు అనుకూలంగా ఉంటుంది.

వోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌ల పూర్తి వివరాలు

సిక్స్-యాక్సిస్

Mi బ్యాండ్ సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ సెన్సార్‌తో వస్తుంది. ఇది జాగింగ్,వాకింగ్ చేస్తున్నప్పుడు శారీరక శ్రమలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది సైక్లింగ్,స్విమింగ్ వంటి శారీరక శ్రమలను కూడా పర్యవేక్షించగలదు. అంతేకాకుండా ఫిట్‌నెస్ ట్రాకర్ 5 ATM రేట్ చేయబడింది. ఇది స్విమింగ్ స్ట్రోక్‌లను గుర్తించగలదు. వీటిలో ఫ్రీస్టైల్, మిక్స్డ్-స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ లను గుర్తించవచ్చు.

తగ్గింపు ఆఫర్‌లతో టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లు

షియోమి
 

షియోమి Mi బ్యాండ్ 4 ఫిట్‌నెస్ వాచ్ 512 KB ర్యామ్‌తో మరియు 16 MB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందిస్తోంది. ఇందులో 135 ఎంఏహెచ్ గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది. ఇది ఒక ఛార్జీతో 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అదనంగా దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది.

రోజుకు 3GB డేటాతో RS.187 ప్రీపెయిడ్ STV ప్లాన్‌ను సవరించిన BSNL

మ్యూజిక్ ట్రాక్‌

వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లోని మ్యూజిక్ ట్రాక్‌ను దీనిని ఉపయోగించి ఒకే ఒక ట్యాప్‌తో మార్చవచ్చు. అదేవిధంగా Mi బ్యాండ్ వినియోగదారులు వాతావరణం యొక్క స్థితిగతులను కూడా తనిఖీ చేయగలరు. వాయిస్ ఆదేశాలను ప్రారంభించడానికి అంతర్నిర్మిత మైక్రోఫోన్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ 5.0 BLE కి మద్దతునిస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకర్ Android 4.4 లేదా iOS 9తో నడుస్తున్న ఫోన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Mi Band 4 Flash Sale in India: Price,Specifications and Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X