మార్కెట్లోకి షియోమీ ఫిట్నెస్ ట్రాకర్

గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన 'గ్లోబల్ మై ఫోన్ ప్రీమియర్ ఈవెంట్'లో భాగంగా చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ 'ఎమ్ఐ 4ఐ' మార్ట్‌ఫోన్‌తో పాటు 'మై బ్యాండ్'ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది.
మై బ్యాండ్‌ను మొట్ట మొదటిసారిగా షియోమి 'ఎమ్ఐ 4' స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలో భాగంగా ప్రపంచానికి పరిచయం చేసింది. ధర రూ.999.

ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ బ్యాండ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ బ్యాండ్‌ను ముందుగా రిజిష్టర్ చేసుకున్న 1000 మంది వినియోగదారులకు రూ.1కే ఈ బ్యాండ్ సొంతమవుతుంది.

షియోమీ ఎమ్ఐ బ్యాండ్ వినియోగదారుడి ఫిట్నెస్‌తో పాటు నిద్రను మానిటర్ చేస్తుంది. బ్లూటూత్ చిప్ ఇంకా యాక్సిలరోమీటర్ ఫీచర్‌లు ఈ బ్యాండ్‌లో పొందుపరిచారు. సింగిల్ చార్జ్ పై 30 రోజల బ్యాకప్‌ను ఈ బ్యాండ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








