Home
News

రూ.1,199లకే ఎంఐ వాటర్ ప్రూప్‌ ట్రిమ్మర్‌,త్వరపడండి

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంక్, ఎంఐ బ్యాండ్ లాంటి యాక్సెసరీస్‌తో ఇండియన్ మార్కెట్‌లో పట్టు సంపాదించుకున్న చైనా దిగ్గజం షియోమి మరో కొత్త గాడ్జెట్ ను ఇండియామ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.ఎల్ఈడీ బల్బ్, ఎయిర్ ప్యూరిఫైర్, సన్‌గ్లాసెస్‌తో ఇండియా మార్కెట్లో పాగా వేసిన షియోమి భారత మార్కెట్‌లోకి వాటర్ ప్రూప్‌తో తయారు చేసిన ఎంఐ ట్రిమ్మర్‌ను ప్రవేశపెట్టింది.

Xiaomi Mi Beard Trimmer launched with 40 length settings at Rs 1,199

కొంతకాలంగా టీజర్లతో ఊరిస్తున్న ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌ను ఎట్టకేలకు ఆవిష్కరించింది. భారత్‌లో మొదటి ఉత్పత్తిని విడుదల చేసినట్లు షియోమి ఇండియా వెల్లడించింది. దీని ప్రీ-ఆర్డర్ ఇప్పటికే మొదలైంది.

ఐపీఎక్స్7 సర్టిఫైడ్

ఐపీఎక్స్7 సర్టిఫైడ్

ఐపీఎక్స్7 సర్టిఫైడ్ చేయబడి మల్టిపుల్ ఫీచర్లతోపాటు ఎంఐ ట్రిమ్మర్ పవర్‌బ్యాంకుతో పని చేయనుంది. బాక్సులో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఎంఐ ట్రిమ్మర్‌ను పవర్ బ్యాంక్‌తో కూడా ఛార్జ్ చేయొచ్చు. ట్రావెల్ చేసేవారికి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.నీళ్లల్లో తడిసినా ట్రిమ్మర్ పాడవదని హామీ ఇస్తోంది. బియర్డ్‌ని స్టైలిష్‌గా మార్చేందుకు 40 లెంత్ సెట్టింగ్స్ ఉన్నాయి. రెండు కోంబ్స్‌ కూడా లభిస్తాయి.

 అన్ని రకాల ట్రెండీ గడ్డాలను..

అన్ని రకాల ట్రెండీ గడ్డాలను..

ఇందులో, ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న అన్ని రకాల ట్రెండీ గడ్డాలను సరిచేసుకునేలా ఎంపికలను అందించారు. పొడవైన, పొట్టిదైనా లేదా కేవలం మూడు రోజుల షేవింగ్ తరువాత వచ్చే రఫ్ గడ్డం వంటి 40 రకాలైన సైజులలో అయినా మీరు మీ గడాన్ని ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఇది డ్యూరబిలిటీ విషయంలో చాల మన్నికైనదని తెలుస్తోంది. గట్టిదనంలోనే కాకుండా నీటిలో కూడా వాడుకునేలా దీన్ని అందించింది. ఒక్క చేత్తో కావాల్సిన పాయింట్స్ సెట్ చేసుకునేలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

 90 నిమిషాల వరకు

90 నిమిషాల వరకు

ఎంఐ ట్రిమ్మర్ల కోసం ఎంఐ.కాం, అమెజాన్, ఎం హోమ్స్ స్టోర్ల ద్వారా ప్రీ-ఆర్డర్స్ చేసుకోవచ్చు. జూన్ 27న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఎంఐ ట్రిమ్మర్ రూ. 1,199 ఉంటుంది. 5 నిమిషాలపాటు చార్జింగ్ పెడితే ట్రిమ్మర్ 10 నిమిషాలు పనిచేస్తుంది. పూర్తిగా చార్జింగ్ చేస్తే 90 నిమిషాల వరకు ట్రిమ్మర్ పని చేస్తుంది.

వైఐ స్మార్ట్‌ దాష్ కెమెరా

వైఐ స్మార్ట్‌ దాష్ కెమెరా

దీంత పాటుగా మార్కెట్‌లోకి మరో కొత్త కెమెరాను షియోమి కంపెనీ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్‌లో వైఐ స్మార్ట్‌ దాష్ కెమెరాను విడుదల చేసింది వైఐ 4కే యాక్షన్ కెమెరా, వైఐ హోమ్ సెక్యూరిటీ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. వైఐ స్మార్ట్‌ దాష్ కెమెరాను కారులో అమర్చుకోవచ్చు. ఈ కెమెరా డ్రైవింగ్ చేసే ప్రాంతాన్ని రికార్డు చేస్తుంది. కెమెరా ధర రూ. 5200 లభిస్తోందని, కెమెరాపై రూ. 699 వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అమెజాన్ ఇండియా ద్వారా వైఐ స్మార్ట్‌ దాష్ కెమెరాను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Beard Trimmer launched with 40 length settings at Rs 1,199; goes on sale from June 27
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X