Home
News

108 ఎంపీ కెమెరా, మొత్తం 5 కెమెరాలతో షియోమి ఎమ్ఐ సీసీ9 ప్రో

By Gizbot Bureau

చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సెన్సార్ కలిగిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఎమ్ఐ సీసీ9 సిరీస్‌ో మరో స్మార్ట్‌ఫోన్ షియోమి ఎమ్ఐ సీసీ9 ప్రోని విడుదల చేసింది. ఎమ్ఐ సీసీ9, ఎమ్ఐ సీసీ9ఈ తర్వాత ఈ సిరీస్‌లో మూడో స్మార్ట్ ఫోన్ ఎమ్ఐ సీసీ 9 ప్రో వచ్చేసింది.కాగా ఎమ్ఐ సీసీ9 ప్రో నవంబర్11 తేదీ నుంచి చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఫీచర్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి.

ధర

ధర

ఎంఐ సీసీ 9 ప్రో ఫోన్ ధరలు కూడా ప్రీమియం రేంజ్ లో ఉన్నాయి. బేసిక్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ ధర రూ . 28వేలు ఉండగా, హై-ఎండ్ 8జీబీ ర్యామ్‌/ 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర సుమారు రూ. 31వెయ్యి ఉంది. కాగా ప్రీమియం ఎడిషన్‌ 8జీబీ ర్యామ్‌/ 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ .35 వేల రూపాయిలుగా ఉంది. 

నోకియా తర్వాత

నోకియా తర్వాత

నోకియా తర్వాత 5 కెమెరాలతో వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. ఈ ఫోన్ కెమెరా సాయంతో 4కె రిజల్యూషన్ వీడియోలు తీసుకునే సౌకర్యం ఉంది. ప్రపంచంలోనే ఈ స్థాయి కెమెరాతో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. ఇప్పటికే చైనా అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

ఫోన్ ప్రత్యేకతలు

ఫోన్ ప్రత్యేకతలు

6.47-అంగుళాల కర్వ్‌డ్‌ ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్, 117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్, 50x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 8 ఎంపీ లాంగ్‌ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌, 5260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లో ఉన్నాయి.

వాచీ విడుదల

వాచీ విడుదల

కంపెనీ ఈ ఫోన్ తో పాటుగా రెండు రకాల స్మార్ట్ వాచీలను కూడా విడుదల చేసింది. వీటి ధర సుమారుగా రూ.13 వేలు, రూ.20 వేలుగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi CC9 Pro with 5 cameras and 108MP sensor launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X