షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. షియోమీ ఫోన్లను వాడుతున్న వారికి రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నది. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ కొత్తగా ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను ఇవాళే లాంచ్ చేసింది. ఇందులో భాగంగా షియోమీ స్మార్ట్‌ఫోన్ ఉన్న వినియోగదారులకు రూ.1000 నుంచి రూ.1 లక్ష వరకు లోన్లను ఇస్తున్నారు. మరి ఎలా పొందాలో తెలుసుకుందాం.

స్టెప్ 1
ఎంఐ క్రెడిట్ సర్వీస్‌లో షియోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలి. సింపుల్ కేవైసీ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి.

స్టెప్ 2
ఆధార్, పాన్ కార్డు వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని ఇచ్చాక 10 నిమిషాల్లో లోన్‌కు అర్హత ఉందా లేదా అనేది నిర్దారిస్తారు.

స్టెప్ 3
లోన్‌కు అర్హత ఉంటే అప్పుడు వినియోగదారులు తమకు కావల్సిన మొత్తాన్ని ఎంపిక చేసుకుని 15 నుంచి 90 రోజుల వరకు వాయిదా పెట్టుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 4
ఇక ఇలా ఇచ్చే లోన్‌కు 3 శాతం వడ్డీ ఉంటుందని షియోమీ వెల్లడించింది. లోన్ గడువు కాలం 15 రోజుల నుంచి 90 రోజుల వరకు పెట్టుకోవచ్చు.

స్టెప్ 5
మీరు తీసుకున్న లోన్ మొత్తం మీరు ఏ బ్యాంకు అకౌంట్ వివరాలు ఇచ్చారో అందులో క్రెడిట్ అవుతుంది. మీరు తీసుకున్న ఈ మొత్తాన్ని KreditBee App via Payment Gateway ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్ 6
పూర్తి వివరాలకు https://in.credit.mi.com/resources/landing/index.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లోన్ ఇచ్చే యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.


Click it and Unblock the Notifications








