షియోమి ఐంఐ ఫ్యాన్ ఫెస్టివల్, డిస్కౌంట్లు, కూపన్లు సొంతం చేసుకోండి

చైనా దిగ్గజం షియోమీ ఇండియా నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది.

|

చైనా దిగ్గజం షియోమీ ఇండియా నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది. ఈ ఫెస్టివల్ లో భాగంగా యూజర్లకు పలు ఎంఐ ఉత్పత్తులపై డిస్కౌంట్లు, కూపన్లు, రాయితీలు లభిస్తాయని షియోమీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఫెస్టివల్‌లో భాగంగా ఎంఐ మిక్స్2, రెడ్‌మీ 5ఏ, రెడ్‌మీ వై1, రెడ్‌మీ నోట్ 5, ఎంఐ బ్యాండ్ 2 తదితర ఉత్పత్తులను, రూ.300 విలువ గల కూపన్లను గెలుచుకునే అవకాశాన్ని షియోమీ కల్పిస్తున్నది. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఎంఐ టీవీ (32 ఇంచెస్), రెడ్‌మీ వై1 లైట్, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, ఎంఐ ఇయర్‌ఫోన్స్ తదితర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను షియోమీ ఇండియా అందివ్వనుంది. ఈ సేల్ లోనే రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రొ, రెడ్‌మి 5, ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీలు అమ్మకానికి రానున్నాయి.మరిన్ని వివరాలకు ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

గూగుల్ ఆ ఫీచర్‌ను షట్‌డౌన్ చేసింది, డేటా డౌన్‌లోడ్‌కి ఆఖరి గడువు ఇదేగూగుల్ ఆ ఫీచర్‌ను షట్‌డౌన్ చేసింది, డేటా డౌన్‌లోడ్‌కి ఆఖరి గడువు ఇదే

కొత్తగా లైక్ ఆప్సన్ ..

కొత్తగా లైక్ ఆప్సన్ ..

ఈ ఫెస్టివల్ లో ఈ సారి కొత్తగా లైక్ ఆప్సన్ ప్రవేశపెట్టింది. యూజర్లు నచ్చిన ఉత్పత్తులపై లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పలు కూపన్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మీ స్నేహితులను ఆహ్వనించడం ద్వారా కూడా మీరు కూపన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువ లైకులు తీసుకొస్తారో వారికి డిస్కౌంట్ లభించే అవకాశముందని కంపెనీ చెబుతోంది.ఈ పోటీ ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది.

4 మిలియన్ల కూపన్లను

4 మిలియన్ల కూపన్లను

కాగా ఈ గేమ్ లో 4 మిలియన్ల కూపన్లను ఉంచినట్లు షియోమి తెలిపింది. షియోమి యూజర్లు ఇద్దరు స్నేహితులను ఈ ఫెస్టివల్ లోకి ఆహ్వనిస్తే వారు రూ.300 కూపన్ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కూపన్ తరువాత ఏప్రిల్ 4న జరిగే సేల్ లో ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు వాడుకోవచ్చు.

ఏప్రిల్ 5 నుంచి 6 మధ్య కాలంలో..

ఏప్రిల్ 5 నుంచి 6 మధ్య కాలంలో..

అలాగే ఏప్రిల్ 5 నుంచి 6 మధ్య కాలంలో buy small get big freeలో కస్టమర్లు లాగిన్ అయితే అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ప్రతి Redmi Note 5 Pro కొనుగోలుపై Mi Earphoneలు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు April 2 to April 6 మధ్య కాలంలో Colour Our Planet' campaignలో యూజర్లు Redmi 5Aని గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. మీరు మరిన్ని వివరాల తెలుసుకోవాలనుకుంటే షియోమి ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

 April 5న ..

April 5న ..

కాగా April 5న Redmi 5, Redmi Note 5, Redmi note 5 pro, ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీలు అమ్మకానికి రానున్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 7,999, రూ.9999, 13,999, 39,999గా ఉన్నాయి.

 

 

షియోమీ రెడ్‌మీ 5

షియోమీ రెడ్‌మీ 5

రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది.

2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999, రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.
షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Fan Festival goes live with discounts on smartphones, televisions and smart bands More News at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X