Home
News

షియోమి ఎంఐ ఫెస్టివల్, భారీ ఆఫర్లలో బెస్ట్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లు

చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మరోసారి ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివల్‌ సేల్‌ను మళ్లీ ప్రారంభించింది. తన వినియోగదారుల కోసం తాజా సేల్‌ద్వారా భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు

చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మరోసారి ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివల్‌ సేల్‌ను మళ్లీ ప్రారంభించింది. తన వినియోగదారుల కోసం తాజా సేల్‌ద్వారా భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఫెస్టివ్‌ సేల్‌ కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో ఎంఐ.కాం, ఆఫ్‌లైన్‌ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర‍్లలో ఈ సేల్‌ ఉంటుంది. షావోమి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.

షియోమి ఎంఐ ఫెస్టివల్, భారీ ఆఫర్లలో బెస్ట్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లు

దీంతోపాటు స్మార్ట్‌ టీవీలను కూడా తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు హెడ్‌ఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోళ్లపై 5శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. షియోమి రెడ్‌మి 6, రెడ్‌మి వై2, రెడ్‌మి నోట్‌ 5ప్రొ, పో​కో ఎఫ్‌1 ఎంఐ ఎల్‌ఈడీ టీవీ4 ప్రొలపై భారీ డిస్కౌంట్‌ను అందివ్వనుంది. తగ్గింపు పొందే ఫోన్ల వివరాలను ఓ సారి చూద్దాం.

పోకో ఎఫ్1

పోకో ఎఫ్1

లేటెస్ట్ ఫ్లాగ్ డివైస్ పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+128 జీబీ మెమరీ) ఫోన్‌ను రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.22,999గా ఉంది.

 రెడ్‌మి నోట్ 5 ప్రో

రెడ్‌మి నోట్ 5 ప్రో

సంచలనం సృష్టించిన రెడ్‌మి నోట్ 5 ప్రో ఫోన్‌లో 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరియంట్‌ను 10,999కు, 6 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.11,999లకు పొందొచ్చు.

మూడు రోజుల ఈ ఎంఐ ఫెస్టివల్‌

మూడు రోజుల ఈ ఎంఐ ఫెస్టివల్‌

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇది ఏప్రిల్ 4న ప్రారంభమయి ఏప్రిల్ 6 వరకు అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల ఈ ఎంఐ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎంఐ బ్యాండ్లు, ఎయిర్ ప్యూరిఫయర్లపై సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

  రూ.1 ఫ్లాష్ సేల్

రూ.1 ఫ్లాష్ సేల్

కంపెనీ అలాగే రూ.1 ఫ్లాష్ సేల్ కూడా నిర్వహించనుంది. మిస్టరీ బాక్స్ సేల్ కూడా ఉంటుంది. ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఎంఐ స్టోర్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

మొబిక్విక్‌తో వ్యాలెట్‌

మొబిక్విక్‌తో వ్యాలెట్‌

షియోమికి చెందిన అన్ని ఉత్పత్తులపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా 5శాతం అదనపు రాయితీని పొందవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రం వెంటనే రాయితీ లభించనుంది. ఇక మొబిక్విక్‌తో వ్యాలెట్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి 15శాతం రాయితీని ఇన్‌స్టా సూపర్‌ క్యాష్‌ రూపంలో పొందవచ్చు.

ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌

ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌

షియోమీ లేటెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ‘ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌' పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌లను ఆడటం ద్వారా రెడ్‌మి నోట్‌ 7, ఎంఐ స్పోర్ట్స్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco F1 Discounts, Redmi Note 7 Pro Sale, Re. 1 Flash Sale, and More in Mi Fan Festival 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X