ప్రారంభమైన 12 గంటల్లో 5 కోట్ల అమ్మకాలు, Mi స్టోర్ సంచలనం

షియోమి తన మొదటి ఎంఐ (Mi) స్టోర్‌ను బెంగుళూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. మే 20న అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ స్టోర్ మొదటి 12 గంటల్లోనే 5 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి చెబుతోన్న వివరాల ప్రకారం..

మొదటి రోజున ఈ స్టోర్‌ను 10,000 మంది Mi ఫ్యాన్స్ సందర్శించారు. వీళ్ల షియోమి బ్రాండ్‌కు చెందిన రకరకాల ఫోన్‌లతో పాటు ఇకోసిస్టం ప్రొడక్ట్స్ ఇంకా యాక్సెసరీస్‌ను కొనుగోలు చేసారు.

రికార్డ్ అయిన సేల్‌లో ఎక్కువ శాతం ఆదాయం...

రికార్డ్ అయిన సేల్‌లో ఎక్కువ శాతం ఆదాయం రెడ్‌మి 4, రెడ్‌మి 4ఏ, రెడ్‌మి నోట్ 4 ఫోన్‌ల నుంచి వచ్చినట్లు షియోమి వెల్లడించింది. ఇవే కాకుండా ఎంఐ వీఆర్ ప్లే, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2, ఎంఐ రౌటర్ 3సీ, ఎంఐ బ్యాండ్ 2లు కూడా అత్యధికంగా సేల్ షియోమీ తెలిపింది.

కొనుగోలు చేసే అవకాశం కూడా ..

షియోమి ఎంఐ స్టోర్‌లలో ఆ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

రానున్న రెండు సంవత్సరాల్లో

రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 100 Mi Home Storeలను లాంచ్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా చెన్నై వంటి మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10,000 వరకు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో షియోమీ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

రికార్డులను నెలకొల్పుతోంది

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Xiaomi బ్రాండ్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. కొద్ది రోజుల క్రితం రెడ్మీ 3ఎస్ ఫోన్ అమ్మకాలను ప్రకటించిన షియోమి తాజగా రెడ్మీ నోట్ 4 అమ్మకాలను వెల్లడించింది.

18 లక్షల రెడ్మీ నోట్ 4 యూనిట్లు

భారత్‌లో రెడ్మీ నోట్ 4 ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల యూనిట్‌లను విక్రయించగలిగిన్లు షియోమి ఇండియా డైరెక్టర్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

బెంగుళూరులో ఎక్కడుంది..?

ప్రస్తుతానికి షియోమి ఎంఐ హోమ్ స్టోర్ బెంగుళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు బెంగుళూరులో ఉన్నట్లయితే ఫోనిక్స్ మార్కెట్ సీటీ మాల్‌లోకి వెళ్లి స్టోర్‌ను సందర్శించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Home Opening Sees Rs 5 Crore Sales in 12 Hours in Bengaluru. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot