Mi Max 2 పై రూ.1000 తగ్గింపు
దీపావళి సేల్ మిస్ అయ్యారా? అయితే మీకో ఛాన్స్. ప్రముఖ బ్రాండ్ Xiaomi తన Mi Max 2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రూ.1000 తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా Mi Max 2 64జీబి వేరియంట్‌ను రూ.15,999కు (ఒరిజనల్ ధర రూ.16,999), 32జీబి వేరియంట్‌ను రూ.13,999కు (ఒరిజినల్ ధర రూ.14,999) సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియాతో పాటు ఫ్లిప్‌కార్ట్ స్టోర్లు విక్రయిస్తున్నాయి. 2017 జూలైలో లాంచ్ అయిన Mi Max 2 ఫోన్ తొలత 64జీబి వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తరువాత 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ మరో హైలైట్.
Mi Max 2 స్పెసిఫికేషన్స్..
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : సోనీ ఐఎమ్ఎక్స్386 సెన్సార్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ సపోర్ట్, హెచ్‌డిఆర్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5300mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ 3.0 క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ (సింగిల్ ఛార్జ్ పై 57 గంటల టాక్‌టైమ్, 18 గంటల వీడియో ప్లేబ్యాక్, 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 9 గంటల గేమింగ్) , యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ వోల్ట్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.


Click it and Unblock the Notifications