అమ్మకానికి రెడీగా షియోమి ఎంఐ మిక్స్ 2!

Posted By: Madhavi Lagishetty

చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమి..ఎంఐ ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి నాందిపలికింది. షియోమి ఎంఐ మిక్స్ 2 కొన్ని రోజుల క్రితమే ఎంఐ నోట్ 3 వూ యిహాన్ ఎడిషన్ను మార్కెట్లో లాంచ్ చేసింది.

అమ్మకానికి రెడీగా షియోమి ఎంఐ మిక్స్ 2!

ఇప్పుడు చైనాలోని షిన్జెన్ లో షియోమి ఒక కొత్త ఎంఐ హోం స్టోర్ను ప్రారంభించింది. 100 మిలియన్ల యువాన్ల ఆదాయానికి 70మిలియన్ల మొబైల్ ఫోన్లు విక్రయించిందని సంస్థ సీఈవో తెలిపారు. వీటితోపాటు షియోమి ఎంఐ మిక్స్ 2 సిరామిక్ వేరియంట్ను కూడా సంస్థ అమ్మకానికి అందుబాటులో ఉంచింది.

ఎంఐ మిక్స్ 2 ఇప్పటికే రెండు వేరియంట్లను...ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేసింది. ఒకటి సిరామిక్ వేరియంట్ కాగా...మరొకటి అల్యూమినియం ఫ్రేమ్ తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. సిరామిక్ వేరియంట్ 8జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ కలిగి ఉంటే... ఇతర వేరియంట్ 6జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజి కలిగి ఉంది. ఇవి పూర్తిగా సిరామిక్ వేరియంట్లో ఉన్నాయి. ఈ సిరామిక్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ను అందంగా తీర్చిదిద్దారు. బ్యాక్ కెమెరా పైన ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ చుట్టూ 18కె గోల్డ్ రింగ్ ఉంటుంది.

ఇక బిల్ట్ విషయానికొస్తే...మేజర్ డిఫరేన్స్ ఉంటుంది. పూర్తిగా సిరామిక్ వేరియంట్ బాడీని కలిగి ఉంటుంది. 1400డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత వద్ద టెస్ట్ చేశారు. 240టన్నుల స్ట్రెంత్ కు లోబడి ఉంటుంది.

మొండికేస్తున్న లక్ష రూపాయల ఐఫోన్ X, తెలివైన సమాధానం ఇచ్చిన ఆపిల్

Cnbeta జిజ్మోచైనా ప్రకారం...షియోమి ఎంఐ మిక్స్ 2 పూర్తి సిరామిక్ వేరియంట్స్మార్ట్‌ఫోన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు చైనాలోని ఎంఐ హోం దుకాణాల్లో లేదా mi.com ద్వారా 4699యువాన్ (సుమారు రూ. 46000) చెల్లించి ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ యుగంలో ఎక్కడినుంచైనా ఫోన్లను కొనుగోలు చేయవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఎంఐ మిక్స్ 2 బిల్ట్ చూసినట్లయితే...ర్యామ్ మరియు స్టోరేజి కెపాసిటి డిఫరెన్స్ లుక్ తో పాటు ఎంఐ మిక్స్ 2 సిరామిక్ వేరియంట్ స్పెసిఫికేషన్ పరంగా ఇతర వేరియంట్ లా ఉంటుంది. 5.60అంగుళాల ఫుల్ హెచ్డి + ఎల్సిడి డిస్ప్లే , 2160 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 18:9ఆస్పెక్స్ రేషియేతో ఉంది. డివైస్ ఒక స్నాప్ డ్రాగేన్ 835ఎస్ఓసితో జతకట్టింది. ఇది 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజి స్పేస్ తోపాటు మైక్రో ఎస్డి కార్డు సహాయంతో 128జిబి వరకు విస్తరించుకునే సదుపాయం ఉంటుంది.

English summary
Xiaomi Mi Mix 2 full ceramic variant has been launched in China and is available for sale at 4699 yuan.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot