అక్టోబర్ 10న Mi Mix 2 లాంచ్ అవుతోంది
Xiaomi ఇండియా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 10న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ సమాచారాన్ని స్వయంగా షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

"వెయిట్ ఈజ్ ఓవర్.. #MiMIX2 అక్టోబర్ 10న ఇండియాకి వచ్చేస్తోంది! అంటూ మను కుమార్ జెయిన్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసారు. షియోమీ ఎంఐ మిక్స్ 2 నెల రోజుల క్రితమే చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఫోన్ స్సెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్2160× 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టి విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,400mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.
చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధరలను పరిశీలించినట్లయితే.. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3299 (ఇండియన్ కరెన్సీలో రూ.32,390), 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3599 (ఇండియన్ కరెన్సీలో రూ.35,387), 6జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3999 (ఇండియన్ కరెన్సీలో రూ.39,210).
Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ సిరామిక్ యునిబాడీ ఎడిషన్‌లో కూడా షియోమీ విక్రయిస్తోంది. ధర RMB 4699 (ఇండియన్ కరెన్సీలో రూ.46,000). ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే వేరియంట్స్ ఇంకా ధర ట్యాగ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 10 అఫీషియల్‌గా రివీల్ అవుతాయి. Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌లోని హైలైట్ ఫీచర్స్...
bezel-less డిస్‌ప్లే
Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ bezel-less స్ర్కీన్‌తో రాబోతోంది. ఈ తరహా స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8+, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, ఎల్‌జీ క్యూ6, వివో వీ7+, ఐఫోన్ ఎక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు bezel-less స్ర్కీన్‌లతో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. త్వరలో వీటి సరసన Mi Mix 2 చేరబోతోంది.
హైక్వాలిటీ కెమెరా..
Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ ప్రధాన కెమెరా యూనిట్‌లో 1.25mm స్మాలర్ కెమెరా మాడ్యుల్‌తో పాటు 1.25-మైక్రాన్ పిక్సల్స్‌తో కూడిన Sony IMX386 sensorను షియోమీ నిక్షిప్తం చేసింది. 4-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇదే తరహా ప్రైమరీ కెమెరా యూనిట్‌ను Mi6
స్మార్ట్‌ఫోన్‌లోనూ షియోమీ వినియోగించింది.
శక్తివంతమైన ప్రాసెసర్..
Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ ఫోన్‌లో వినియోగించిన Qualcomm Snapdragon 835 చిప్‌సెట్ బెస్ట్ క్లాస్ పెర్ఫామెన్స్‌ను కనబరుస్తుంది. 6జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ
స్మార్ట్‌ఫోన్ 64GB, 128GB ఇంకా 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








