8జీబి ర్యామ్‌తో Mi Mix 2..?
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షావోమి, తన మొట్టమొదటి బీజిల్-లెస్ స్మార్ట్‌ఫోన్ Mi Mix 2ను కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 5.9 అంగుళాల ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే (18:9 కారక నిష్పత్తి), ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ వంటి ప్రీమియమ్ రేంజ్ ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ.35.999గా ఉంది.

ఇంచుమించుగా ఇదే ధర ట్యాగ్‌లో లభ్యమవుతోన్న OnePlus 5, Nokia 8, LG G6ల నుంచి Mi Mix 2కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఎడిషన్ Mi Mix 2ను కూడా రంగంలోకి దింపేందుకు షావోమి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ చైైనా వెబ్‌సైట్ Weibo ద్వారా రివీల్ అయిన వివరాల ప్రకారం Mi Mix 2కు సంబంధించి 8జీబి ర్యామ్ వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఆల్ సిరామిక్ వైట్ బాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరొక కథనం ప్రకారం ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ స్టాండర్డ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో కూడా లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే 11.11 సేల్ ప్రమోషన్స్‌లో భాగంగా Mi Mix 2 స్పెషల్ ఎడిషన్‌ను షావోమి అనౌన్స్ చేసే అవకాశం ఉందట. చైనా మార్కెట్లో ఈ డివైస్ ధర 4699 Yuan (రూ.46,208) వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Xiaomi Mi MIX 2 పూర్తి స్పెసిఫికేషన్స్..
5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ బీజిల్-లెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1080x2160 పిక్సల్స్), MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్ (విత్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్.
12 మెగా పిక్సల్ సోనీ IMX386 రేర్ కెమెరా సెన్సార్ (ప్రత్యేకతలు : 1.25 మైక్రాన్ పిక్సల్స్, 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 5-పీస్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఫేషియల్ రికగ్నిషన్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3400mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై 802.11c, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను Flipkartతో పాటు Mi.comలు విక్రయిస్తున్నాయి. ధర రూ.35.999.


Click it and Unblock the Notifications








