ఈ పవర్ బ్యాంక్ ఇండియాకు వస్తే ఎగబడి కొనేస్తారు
రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో..
స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో వరస హిట్లతో దూసుకుపోతున్న షియోమీ ఇటు తన యాక్సెసరీస్ విభాగం పైనా దృష్టిసారిస్తోంది. త్వరలోనే తరువాతి వర్షన్ Mi పవర్ బ్యాంక్‌లను కూడా షియోమీ, ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఈ విడుదలకు సంబంధించిన వివరాలను షియోమి ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం షియోమీ లాంచ్ చేయబోతోన్న తరువాతి జనరేషన్ Mi పవర్ బ్యాంక్ రెండు రకాల యూఎస్బీ పోర్టులను కలిగి ఉంటుంది.

అందులో ఒకటి సాధారణ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కాగా రెండవది యూఎస్బీ టైప్-సీ పోర్ట్. అంతేకాకుండా, ఈ పవర్ బ్యాంక్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన క్విక్ ఛార్జ్ 3.0ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వారికి ఈ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. ప్రయాణ సమయంలో మీ ఫోన్‌లను ఈ పవర్ బ్యాంక్ వేగంగా ఛార్జ్ చేయగలదు. ప్రత్యేమైన LED ఇండికేటర్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్‌లో ఛార్జింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఈ పవర్ బ్యాంక్ 10000mAh అలానే 20000mAh కెపాసిటీల్లో అందుబాటులో ఉంటుంది. షియోమీ పవర్ బ్యాక్స్ 93% కన్వర్షన్ రేటుతో పాటులో పవర్ మోడ్‌తో వస్తాయి. పవర్‌బ్యాంక్ పవర్ బటన్‌ను రెండు సార్లు ప్రెస్ చేసినట్లయితే 'లో వపర్ మోడ్’ ఆన్ అవుతుంది. ఈ మోడ్‌లో షియోమీ బ్లుటూత్ హెడ్‌సెట్‌లతో పాటు ఎంఐ బ్యాండ్‌లను ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. చైనా మార్కెట్లో Mi Power Bank 2 ధర 79 yuanలుగా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ రూ.1200. ఇండియన్ మార్కెట్లో ఈ పవర్ బ్యాంక్ ధర ఎంతుంటుంది అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








