Home
News

Xiaomi కొత్త స్మార్ట్ టీవీ Mi TV 4A హారిజోన్ ఎడిషన్ లాంచ్!!! ధర కూడా తక్కువే...

షియోమి సంస్థ నేడు తన స్మార్ట్ డివైస్ యొక్క లైనప్ లో కొత్తగా Mi టివి 4A స్మార్ట్ టెలివిజన్లు ఇండియా యొక్క మార్కెట్లో విడుదల చేసారు. బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలను విడుదల చేసే షియోమి ఇప్పుడు కూడా అప్‌గ్రేడ్‌ ఫీచర్లతో తక్కువ ధరలో Mi హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీని విడుదల చేసారు. ఈ హారిజోన్ ఎంట్రీ లెవల్ టీవీ మోడల్ మునుపటి తరం కంటే తక్కువ బెజెల్స్‌తో మరియు అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. సెప్టెంబర్ 11 నుండి మొదటి సారి అమ్మకానికి వచ్చే ఈ స్మార్ట్ టీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ టీవీ ధరల వివరాలు

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ టీవీ ధరల వివరాలు

షియోమి యొక్క కొత్త Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ ఇండియాలో రెండు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తుంది. 32 అంగుళాల హెచ్‌డి రెడీ డిస్‌ప్లేను కలిగిన ఎంట్రీ లెవల్ టీవీ యొక్క ధర 13,499 రూపాయలు. ఈ మోడల్ సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.కామ్ ద్వారా అమ్మకానికి రానున్నది. అలాగే 43 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే పరిమాణంలో లభిస్తున్న టీవీ యొక్క ధర రూ.22,999. ఈ వేరియంట్ యొక్క అమ్మకాలు సెప్టెంబర్ 16 నుండి అమెజాన్ మరియు Mi.కామ్ ద్వారా మొదలుకానున్నాయి.

Mi TV 4A హారిజోన్ ఎడిషన్ టీవీ స్పెసిఫికేషన్స్  

Mi TV 4A హారిజోన్ ఎడిషన్ టీవీ స్పెసిఫికేషన్స్  

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ యొక్క డిస్‌ప్లే బెజెల్-లెస్ డిజైన్ ద్వారా తయారు చేయబడి ఉంటుంది. ఇది 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 178-డిగ్రీల వీక్షణ కోణాన్ని కలిగి ఉంది. Mi టీవీ హారిజోన్ ఎడిషన్ సిరీస్‌లో Mi యొక్క యాజమాన్య వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. షియోమి యొక్క కొత్త టీవీలు ఖచ్చితమైన స్క్రీన్ క్రమాంకనం, లోతైన వైరుధ్యాలు మరియు కలర్ పునరుత్పత్తిలో ఖచ్చితత్వాన్ని అందిస్తుంది.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ ఫీచర్స్

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ ఫీచర్స్

షియోమి కొత్త సిరీస్ Mi టీవీలు భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యాచ్‌వాల్ వెర్షన్‌తో శక్తిని పొందుతాయి. ఈ  ప్యాచ్‌వాల్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మొదలైన OTT యాప్ లను ముందే ఇంస్టాల్ చేయబడి వస్తుంది. వీటితో పాటుగా మరిన్ని ఆన్ లైన్ కంటెంట్ స్ట్రీమ్ లను అందించే యాప్ లను అనుమతిస్తుంది. మీరు ఇప్పుడు ఒకే క్లిక్‌తో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో షోలు / సినిమాలను కనుగొనడానికి యూనివర్సల్ సెర్చ్ ను ఉపయోగించవచ్చు. కిడ్స్ మోడ్ ద్వారా ఇప్పుడు పిల్లలకు అనుచితమైన కంటెంట్‌ను పరిమితం చేయడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ క్యూరేటెడ్ కంటెంట్‌

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ క్యూరేటెడ్ కంటెంట్‌

Mi టీవీ కొత్త సిరీస్ యొక్క క్యూరేటెడ్ జాబితాలతో యూజర్లు సెలెబ్రిటీ వాచ్‌లిస్ట్, ఇండియా టాప్ 10 టుడే, కలెక్షన్స్, ప్రాంతీయ భాషలు వంటి మరెన్నో జాబితాలతో సులభంగా కంటెంట్‌ను కనుగొనగలరు. వన్ క్లిక్ ప్లేతో మీరు హాట్స్టార్ ఆధారిత స్పోర్ట్స్ పేజీలో క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి గేమ్ లను సులభంగా చూడవచ్చు. ప్యాచ్‌వాల్ నుండి నేరుగా విలీనం చేయబడిన 7+ లైవ్ న్యూస్ ఛానెల్‌ల నుండి కూడా మీరు వార్తలను చూడవచ్చు.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ సాఫ్ట్ వెర్

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ సాఫ్ట్ వెర్

షియోమి యొక్క పాత మోడళ్ల మాదిరిగానే Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టివి 9 పైతో రన్ అవుతుంది. అందువల్ల మీరు Google Play యాప్ లు మరియు Chromecast లకు సులభంగా యాక్సిస్ ను పొందుతారు. గూగుల్ అసిస్టెంట్‌కు సులభంగా యాక్సిస్ ను కూడా చెయ్యవచు. బండిల్ చేయబడిన రిమోట్ కంట్రోలర్‌తో వినియోగదారులు వాయిస్ ఆదేశాల ద్వారా సెర్చ్ చేయవచ్చు. గూగుల్ డేటా సేవర్ మోడ్ ను కూడా కలిగి ఉంది. ఇది డేటాను వృధా చేసే మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇవి కాకుండా ఇందులో Mi క్విక్‌వేక్ ఫీచర్ కూడా ఉంది. ఇది మీ యొక్క టీవీని కేవలం ఐదు సెకన్లలో ఆన్ చేయడానికి సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4A Horizon Edition New Smart TV Released in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X