ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??

|

షియోమి యొక్క మొదటి స్మార్ట్ వాచ్ ఇప్పుడు రిలీజ్ అయింది. Mi వాచ్ అని పిలువబడే ఈ స్మార్ట్ వాచ్ కొత్త Mi CC 9 ప్రో మరియు Mi టివి 5 సిరీస్‌లను ప్రారంభించడానికి చైనాలోని బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించబడింది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న Mi వాచ్ ఆపిల్ వాచ్‌కు సమానమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంది.

 Mi వాచ్
 

షియోమి ప్రకారం Mi వాచ్ 44mm డయల్ మరియు స్పోర్ట్స్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌ ముగింపుతో వస్తుంది. స్మార్ట్ వాచ్‌లో సిరామిక్ బ్యాక్ కవర్, ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ మరియు రబ్బరు స్ట్రాప్ వంటివి ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్, గ్లాస్ ప్రొటెక్షన్ మరియు స్టెయిన్లెస్-స్టీల్ ఫ్రేమ్‌తో వచ్చే Mi వాచ్ యొక్క ప్రీమియం వేరియంట్‌ను కంపెనీ త్వరలో అందించనుంది.

షియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీ

ధరల వివరాలు

ధరల వివరాలు

షియోమి తెలిపిన వివరాల ప్రకారం Mi వాచ్ ధర CNY 1,299. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.13,000. అలాగే వాచ్ యొక్క ప్రీమియం వేరియంట్ విలువ CNY 1,999 (సుమారు రూ .20,000). Mi వాచ్ నవంబర్ 11 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం ఇది చైనాలో మాత్రమే లభిస్తుంది. మిగిలిన దేశాలలో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఎటువంటి సమాచారం లేదు. Mi వాచ్ సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

నవంబర్ 5న రిలీజ్ అవుతున్న షియోమి 108-MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ Mi CC9 ప్రో

Mi వాచ్ VS ఆపిల్ స్మార్ట్ వాచ్

Mi వాచ్ VS ఆపిల్ స్మార్ట్ వాచ్

షియోమి Mi వాచ్ ధరల విభాగంలో ఆపిల్ స్మార్ట్ వాచ్ తో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తున్నది. ఫీచర్స్ పరంగా చూసుకున్న కూడా రెండు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ రంగంలో సత్తా చాటినట్లుగా స్మార్ట్ వాచ్ విభాగంలో కూడా షియోమి ఎంత వరకు ప్రభంజనం సృష్టిస్తోందో ముందు ముందు చూడాలి.

Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

Mi వాచ్‌లో 326ppi లతో 1.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే (368x448 పిక్సెల్స్) ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 SoC చేత రన్ అవుతుంది. ఇందులో eSIM ద్వారా డ్యూయల్ సిమ్ సెల్యులార్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. స్మార్ట్ వాచ్‌లో వై-ఫై కనెక్టివిటీ,బ్లూటూత్, NFC సపోర్ట్ మరియు 570mAh బ్యాటరీ కూడా ఉన్నాయి.ఇది ఒక ఛార్జీపై 36 గంటల వరకు పనిచేస్తుంది అని కంపెనీ పేర్కొంది.

అమెజాన్ లో గొప్ప ఆఫర్లతో రెడ్‌మి నోట్ 8 ప్రో సేల్స్

సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే షియోమి MIUI ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అప్డేట్ వెర్షన్ ను ఉపయోగించింది. ఇది స్మార్ట్ వాచ్‌ల కోసం సర్దుబాటు చేయబడింది. వాచ్ కోసం MIUI గా పిలువబడుతుంది. ఇది గూగుల్ యొక్క వేర్ OS నుండి భాగాలను కలిగి ఉంటుంది. వాచ్ కోసం MIUI డౌన్‌లోడ్ చేయగల యాప్ లు, యాప్ స్టోర్, వాచ్ ఫేస్ మార్కెట్, డార్క్ మోడ్ మరియు కస్టమ్ వాచ్ ఫేస్‌లకు మద్దతును కలిగి ఉంది. స్మార్ట్ హోమ్ డివైస్ లు మరియు మరిన్నిటిని నియంత్రించడానికి షియోమి తన సొంత వాయిస్ అసిస్టెంట్‌ను Mi వాచ్‌లో ఇన్స్టాల్ చేసారు.

ట్రాకింగ్

ఫిట్‌నెస్ మరియు హెల్త్ ట్రాకింగ్ లక్షణాల పరంగా మీరు ఆడే ఆటల యొక్క కార్యకలాపాల వివరణను అందించడం కోసం Mi వాచ్ స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, బాడీ ఎనర్జీ ట్రాకింగ్ వంటి 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.

సెన్సార్

అదనంగా షియోమి Mi వాచ్ సిక్స్-యాక్సిస్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, జిపిఎస్ సపోర్ట్, దిక్సూచి మరియు బేరోమీటర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇది వాటర్-ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Mi Watch Launched: Price, Sale Date, Specs, Features Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X