షియోమి యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఏ యాడ్స్ మీకు కనపడవు

By Gizbot Bureau
|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా అందిస్తోన్న MIUI కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం వందల కొద్ది కస్టమేజేషన్ ఆప్షన్‌లతో యూజర్లను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులోని కస్టమైజేషన్స్ ఆప్షన్స్ సైతం MIUI కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులో ఉండటం విశేషం.

 
షియోమి యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఏ యాడ్స్ మీకు కనపడవు

సాధారణంగా షియోమీ స్మార్ట్‌ఫోన్లలో ఆ కంపెనీకి చెందిన యూజర్ ఇంటర్‌ఫేస్ MIUI ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా మరిన్ని ఫీచర్లు అందించే ఇంటర్‌ఫేస్ ఇది. MIUI యూజర్లను బాగానే ఆకట్టుకుంటున్నా అందులో ప్రధానంగా యాడ్స్ సమస్య యూజర్లను వేధిస్తూ ఉంటుంది. షియోమి రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాడ్స్ కాస్త ఇరిటేటింగ్‌గా ఉంటాయి. ఈ యాడ్స్ తమకు తలనొప్పిగా మారాయని యూజర్లు అనేకసార్లు కంప్లైంట్స్ చేశారు కూడా. యాడ్స్ ఆపెయ్యాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. త్వరలో ఈ యాడ్స్ సమస్యల్ని పరిష్కరిస్తామని షియోమీ కంపెనీ సీఈఓ లీ జున్ ప్రకటించారు.

MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొందరే ఇష్టపడుతున్నారు.

MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొందరే ఇష్టపడుతున్నారు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూ వస్తోన్న MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కేవలం కొంత మంది యూజర్లు మాత్రమే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానమైన కారణం, ఈ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలోని స్టాక్ యాప్స్ పదేపదే యాడ్స్‌ను డిస్‌ప్లే చేయటమేనట. ఈ యాడ్స్ అనేవి నోటిఫికేషన్స్ షేడ్స్ అలానే స్మార్ట్‌ఫోన్ ఇతర భాగాల్లో కనిపిస్తుండటంతో కొందరు అసహనానికి గురువుతున్నట్లు తెలుస్తోంది.

 MIUI 11 అప్‌గ్రేడ్‌లో యాడ్స్

MIUI 11 అప్‌గ్రేడ్‌లో యాడ్స్

షియోమి యూజర్లకు ఇబ్బందిగా మారిన యాడ్స్ విషయంలో వెనక్కు తగ్గాలని, MIUI 11 అప్‌గ్రేడ్‌లో యాడ్స్ తగ్గించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే MIUI 11 అప్‌డేట్ రూపొందిస్తుంది. యూజర్లకు MIUI 11 అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఇక యాడ్స్ వీలైనంత తక్కువగా కనిపిస్తాయి. షియోమి స్మార్ట్‌ఫోన్లల్లో వల్గర్ యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయని యూజర్లు ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వీటిపైన దృష్టిపెట్టింది. అశ్లీలమైన, చికాకుపర్చే యాడ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని తెలిపింది. వెబ్ బ్రౌజర్ ఇలాంటి యాడ్స్, నోటిఫికేషన్స్ పుష్ చేస్తుందని గుర్తించిన షియోమీ వాటిని కంట్రోల్ చేసే పనిలో ఉంది. కాగా ఇదంతా పూర్తయ్యేసరికి కనీసం రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

 

 

  పదేపదే విసిగిస్తోన్న యాడ్స్‌ను డిసేబుల్ చేయాలంటే..?
 

పదేపదే విసిగిస్తోన్న యాడ్స్‌ను డిసేబుల్ చేయాలంటే..?

యాడ్స్‌ను డిసేబుల్ చేసే క్రమంలో యూజర్లు సంబంధిత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి receive recommendations ఆప్షన్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా యాడ్స్‌ను డిసేబుల్ చేయవచ్చు. ఇలా కాకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మరో ప్రొసీజర్ ద్వారా షియోమి యాప్స్‌ నుంచి మొత్తం యాప్స్‌ను డిసేబుల్ చేసే వీలుంటుంది.

స్టెప్ బై స్టెప్ గైడ్..

స్టెప్ బై స్టెప్ గైడ్..

ఈ ప్రొసీజర్‌ను అప్లై చేసే క్రమంలో ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో Authorisation and revocation ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని disable msa to turn off system విభాగంలోకి వెళ్లాలి. ఇందులోని wide adsను సెలక్ట్ చేసుకున్నట్లయితే షియోమి యాప్స్‌ నుంచి వచ్చే మొత్తం యాప్స్ డిసేబుల్ కాబడతాయి. ఈ ఫీచర్ Poco F1 స్మార్ట్‌ఫోన్‌తో MIUI 9 లేదా MIUI 10 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే ప్రతి షియోమి స్మార్ట్‌ఫోన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

MIUIలో యాడ్స్‌ ఎందుకు డిస్‌ప్లే అవుతున్నాయంటే..?

MIUIలో యాడ్స్‌ ఎందుకు డిస్‌ప్లే అవుతున్నాయంటే..?

పోటీ మార్కెట్ నేపథ్యంలో షియోమి తన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ లాభంతో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోకొంత లభాన్ని రాబట్టుకునేందుకు తన బ్రౌజర్, సెక్యూరిటీ ఇంకా ఫైల్ మేనేజర్ యాప్స్ ద్వారా యాడ్స్‌‌ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. అయితే, వీటిని డిసేబుల్ చేసే ఆప్షన్‌ను షియోమి అందుబాటులోకి తీసుకురావటంతో చాలా మంది యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Best Mobiles in India

English summary
Xiaomi MIUI ads: Company details its work to fix irritating vulgar ads and cleaning the OS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X