షియోమీ కొత్త ఫోన్ Mix 5 ఫోటోలు లీక్.. డిజైన్, స్పెసిఫికేషన్ల వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఈ సంవత్సరం మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Xiaomi Mix 5 పేరిట ఈ ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 2021 ఆగస్టులో వచ్చిన షియోమీ Mix 4కు తర్వాత వెర్షన్‌గా తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.
గత సంవత్సరమే షియోమీ మిక్స్5 ఫోన్‌పై కొన్ని కథనాలు వచ్చాయి. 2022లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. కానీ లాంచ్ చేయలేదు. ఇన్నాళ్లుకు మరోసారి ఈ ఫోన్ వార్తల్లోకి వచ్చింది. డిజిటల్ చాట్ స్టేషన్ టిప్‌స్టర్ Weibo.. మిక్స్5 స్మార్ట్‌ఫోన్ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ సహా పలు స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.

షియోమీ మిక్స్5 ఫోన్ అన్ని వైపులా స్లిమ్ బెజిల్ మోడల్‌ను కలిగి ఉంది. మరియు 6.73 అంగుళాల అమోలెడ్ డ్లిస్ప్లే 120 Hz రీఫ్రెష్ రేట్‌తో రానుందని తెలుస్తోంది. 3200*1440 పిక్సల్స్ రిజల్యూషన్‌తో లాంచ్ కానుందని సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్2 చిప్‌సెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరియు 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే MIUI 14తో షియోమీ మిక్స్5 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షియోమీ మిక్స్5 స్మార్ట్‌ఫోన్ 4820mAh బ్యాటరీతో రానుందని, 200W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుందని సమాచారం.
షియోమీ మిక్స్5 ఫోన్‌లో ప్రత్యేకంగా సెల్ఫీ కెమెరా డిస్ల్పే కిందనే అమర్చినట్లు తెలుస్తోంది. వెనుక కెమెరా విషయానికి వస్తే మూడు కెమెరాలతోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. 50MP OIS లెన్స్‌తో ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో రెండో కెమెరా, 48MP టెలీఫోటో లెన్స్ సహా 2x ఆప్టికల్ జూమ్‌తో మూడో కెమెరా ఉంటాయని తెలుస్తోంది.
ఈ ఫోన్ గత సంవత్సరమే లాంచ్ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
2021 ఆగస్టులో వచ్చిన షియోమీ Mix 4 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ఎస్‌వోసీ మరియు 4500mAh బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయింది. 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్ప్లేతో రిలీజ్ అయింది. ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలతో లాంచ్ చేశారు. 108MP ప్రైమరీ కెమెరా, 13MP, 8MP కెమెరాలు కలిగి ఉంది. మరియు స్మార్ట్‌ఫోన్ ముందుభాగంలో 20MP కెమెరా ఏర్పాటుచేశారు.
షియోమీ మిక్స్ 4 లాంచ్ అయిన సమయంలో 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ కలిగిన ఫోన్ ధర 57,000 రూపాయలు. అదే 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ ఫోన్ ధర 60,850 రూపాయలు. అదే 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ ఫోన్ ధర రూ.66,000. 512GB స్టోరేజ్ మరియు 12GB ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర 72,300 రూపాయలుగా ఉండేది. అయితే ఓ ఫోన్ తర్వాత వెర్షన్ షియోమీ మిక్స్ 5 ఎంత ధరలో రిలీజ్ కానుందనేది ఇంకా తెలియలేదు.


Click it and Unblock the Notifications








