Xiaomi నుంచి మొదటి Flip ఫోన్! ధర, స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
షియోమీ సంస్థ నుంచి Xiaomi Mix Flip మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ రానున్నట్లు, దీనిపై పని జరుగుతున్నట్లు చెప్పబడింది. షియోమీ అధికారికంగా దాని ఉనికిని నిర్ధారించలేదు, అయితే, చైనీస్ బ్రాండ్ చైనా వెలుపల గ్లోబల్ మార్కెట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.ఈ ఫోన్ గురించిన వివరాలు IMEI డేటాబేస్‌లో ఫోన్ యొక్క డిజైన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్లు ఈ పుకారుకు మరింత విశ్వసనీయతను కలిగిస్తాయి. దీనిని మోడల్ నంబర్ 2405CPX3DG తో IMEI డేటాబేస్ ధృవీకరణ ప్లాట్‌ఫారమ్‌లో గుర్తించబడింది.
Xiaomi మిక్స్ ఫ్లిప్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు IMEI డేటాబేస్‌లో గుర్తించబడ్డాయి
ప్రముఖ టిప్‌స్టర్ Erencan Yılmaz (@erenylmaz075) , IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్ 2405CPX3DG తో ఈ షియోమీ మిక్స్ ఫ్లిప్ ను గుర్తించారు. షియోమీ మిక్స్ ఫ్లిప్ మోడల్ నంబర్‌లోని "G" అనేది "గ్లోబల్" అని చెప్పబడింది.

అంటే, ఇది అంతర్జాతీయ మార్కెట్‌లలో ఫోన్ లభ్యతను సూచిస్తుంది. ఇంతలో, మిక్స్ ఫ్లిప్ యొక్క చైనీస్ వేరియంట్ మోడల్ నంబర్ 2405CPX3DC తో కూడా ధృవీకరించబడింది.
షియోమీ మిక్స్ ఫ్లిప్ యొక్క గ్లోబల్ లాంచ్ గురించి పుకార్లు నిజమని తేలితే, అది గెలాక్సీ Z ఫ్లిప్ 5, ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్, మోటోరోలా యొక్క రేజర్ 40 లైనప్ మరియు నిలువు డిస్ప్లేలతో మరిన్ని ఫోన్‌లకు పోటీని సృష్టిస్తుంది.
భారతదేశం మరియు జపాన్ మినహా గ్లోబల్ మార్కెట్లలో ఇది అధికారికంగా లాంచ్ అవుతుందని సూచించబడింది. షియోమీ యొక్క ఈ ఫోల్డబుల్ లైనప్‌లోని మునుపటి ఫోన్లు అన్నీ చైనాకు మాత్రమే ప్రత్యేకముగా లాంచ్ అయ్యాయి.
Xiaomi మిక్స్ ఫ్లిప్ అంచనా స్పెసిఫికేషన్ల వివరాలు,ధర వివరాలు
షియోమీ మిక్స్ ఫ్లిప్ ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో షియోమీ ఫోల్డ్ 4తో పాటు అధికారికంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేయబడింది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే మరియు 4,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా శక్తిని పొందుతుంది మరియు 50-మెగాపిక్సెల్ OV50E ప్రైమరీ సెన్సార్ మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 60-మెగాపిక్సెల్ OV60A సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను పొందవచ్చు. ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పబడింది. గత లీక్‌ల ప్రకారం,ఈ షియోమీ మిక్స్ ఫ్లిప్ ధర CNY 5,999 (భారత కరెన్సీ లో దాదాపు రూ. 69,000) గా ఉండవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Image Source:mundoxiaomi.com


Click it and Unblock the Notifications








