Home
News

Xiaomi నుంచి Flip ఫోన్ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు

షియోమీ సంస్థ నుంచి Xiaomi Mix ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం చివరిలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్ లో ఈ స్మార్ట్‌ఫోన్ గత కొన్ని నెలలుగా వార్తలలో ఉంది. కానీ ఇంకా ఇది అధికారికంగా ప్రకటించబడలేదు.

ఈ ఫోన్ షియోమీ యొక్క Mix ఫోల్డ్ 4 తో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా త్వరలో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త నివేదికలు షియోమీ మిక్స్ ఫ్లిప్ ఫోన్ యొక్క డిస్ప్లే మరియు కెమెరా వివరాలతో సహా అనేక ఇతర కీలక స్పెసిఫికేషన్‌లను కూడా సూచిస్తున్నాయి.లీక్ అయిన హ్యాండ్‌సెట్ డిజైన్ రెండర్లు కూడా షేర్ చేయబడింది.

Xiaomi Mix Flip Smartphone Display Design And Camera Details Leaked  Expected To Feature 50MP Camera

Xiaomi మిక్స్ ఫ్లిప్ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్‌తో 1/2.8-అంగుళాల 60-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV60A సెకండరీ కెమెరా సెన్సార్‌తో పాటు 1/1.55-అంగుళాల 50-మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800ని ప్రైమరీ సెన్సార్‌గా కలిగి ఉండే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇంకా, నివేదిక ప్రకారం. OV60A సెన్సార్ సాధారణంగా సెల్ఫీ కెమెరాలలో ఉపయోగించబడుతుందని నివేదిక పేర్కొంది. అయితే Xiaomi మిక్స్ ఫ్లిప్‌లో ఇది సెకండరీ వెనుక కెమెరాగా ఉపయోగించబడుతోంది. ఎందుకంటే కవర్ స్క్రీన్ సహాయంతో కూడా, సెల్ఫీలను క్లిక్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు.

షియోమీ మిక్స్ ఫ్లిప్ ఫోన్ యొక్క ప్రాధమిక డిస్‌ప్లేలో ఉంచబడిన ఫ్రంట్ కెమెరా సెన్సార్‌గా 32-మెగాపిక్సెల్ OV32B సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని నివేదిక తెలియచేస్తోంది. షియోమీ 14 అల్ట్రా మరియు మోటోరోలా ఎడ్జ్ 40 వంటి మోడళ్లలో ఇదే సెన్సార్ ముఖ్యంగా ఉపయోగించబడింది.

లీక్ అయిన వివరాల ప్రకారం, షియోమీ మిక్స్ ఫ్లిప్ ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు 520ppi పిక్సెల్ డెన్సిటీతో ప్రధాన డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ల యొక్క మోడల్ నంబర్‌లు "2405CPX3DG" మరియు "2405CPX3DC"ని కలిగి ఉందని నివేదిక పేర్కొంది.

ఇంతకు ముంది వచ్చిన నివేదికల ప్రకారం Xiaomi Mix Flip ఫోన్ మొదట చైనాలో లాంచ్ అవుతుందని సూచించింది, Xiaomi Mix Fold 4 వలె కాకుండా, చైనా మార్కెట్‌లో మాత్రమే అందించబడుతుందని సూచించబడింది. అయితే, మిక్స్ ఫ్లిప్ మోడల్ భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదని నివేదిక పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌కి "రూయి" అనే సంకేతనామం ఉందని మరియు "N8" యొక్క అంతర్గత మోడల్ నంబర్‌ను కలిగి ఉందని కూడా లీక్ తెలియచేస్తోంది.

ఈ షియోమీ యొక్క మిక్స్ ఫ్లిప్ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. ఇది ఫోన్ యొక్క సాధ్యమైన డిజైన్ ను కూడా షేర్ చేసింది. ప్రధాన డిస్ప్లే ముందు కెమెరా మరియు ఏకరీతి బెజెల్‌లను ఉంచడానికి రంధ్రం-పంచ్ స్లాట్‌తో కనిపిస్తుంది.

ఇంకా,దీర్ఘచతురస్రాకార కవర్ స్క్రీన్ వెనుక కెమెరా మాడ్యూల్ క్రింద ఉంచబడింది. మాడ్యూల్ LED యూనిట్లతో పాటు రెండు వెనుక కెమెరా సెన్సార్లను కలిగి ఉంది.

Image Source:mundoxiaomi.com

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mix Flip Smartphone Display,Design And Camera Details Leaked. Expected To Feature 50MP Camera.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X