షియోమీ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్! లాంచ్ త్వరలోనే... వివరాలు
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఆకర్షణ అధికంగా ఉంది. అందుకే, అన్ని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా ఫోల్డబుల్ డిజైన్ తో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాడానికి సన్నాహాలు చేయిస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన షియోమీ కూడా త్వరలోనే Xiaomi మిక్స్ ఫోల్డ్ 3 ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
Xiaomi సంస్థ వ్యవస్థాపకుడు మరియు CEO లీ జున్ రాబోయే తమ ఫోల్డబుల్ ఫోన్లో లైకా-ట్యూన్డ్ కెమెరాలు వస్తాయని ధృవీకరించారు. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC మరియు 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఆగస్ట్ 2022లో లాంచ్ చేయబడిన Xiaomi Mix Fold 2 కి కొనసాగింపుగా వస్తుందని భావిస్తున్నారు. త్వరలో, రాబోయే ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మునుపటి మోడల్ కంటే మరింత కాంపాక్ట్ బాడీలో మెరుగైన స్పెసిఫికేషన్‌లతో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.

Xiaomi వ్యవస్థాపకుడు మరియు CEO Lei Jun ఈ మిక్స్ ఫోల్డ్ 3 ఆగస్టులో లాంచ్ చేయబడుతుందని ఒక ట్వీట్‌లో ధృవీకరించారు. అక్కడ ఫోన్‌లోని లైకా-ట్యూన్డ్ కెమెరాలు కస్టమర్‌లకు మొబైల్ ఫోటోగ్రఫీలో "పురోగతులు" అందిస్తాయని అతను పేర్కొన్నాడు. ఈ హ్యాండ్‌సెట్‌లోని కెమెరాలు మైక్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మోటార్లు మరియు అల్ట్రా-స్లిమ్ హై రిఫ్రాక్టివ్ లెన్స్‌లను కలిగి ఉంటాయి.
ఈ ఫోన్ యొక్క క్వాడ్ కెమెరా యూనిట్ స్లిమ్ మరియు లైట్ వెయిట్ బుక్-స్టైల్ ఫోల్డబుల్‌పై మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడే కాంపాక్ట్ పెరిస్కోప్ కెమెరా మాడ్యూల్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని సీఈఓ జూన్ వివరించారు.
ఈ ట్వీట్‌కు జోడించిన ప్రచార చిత్రం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ యొక్క సిల్హౌట్‌ను చూపుతుంది మరియు మిక్స్ ఫోల్డ్ 3 వెనుక వైపు క్వాడ్ కెమెరా యూనిట్‌తో ఆల్-ఫోకల్-లెంగ్త్ ఫీచర్‌తో ప్రారంభించబడుతుందని పేర్కొంది.ఈ హ్యాండ్‌సెట్ బాడీ బ్లాక్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ను ఆగష్టు లో ధృవీకరించబడినప్పటికీ, ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఇంకా లాంచ్ కోసం తేదీని ఖరారు చేయలేదు.
ఇటీవలి నివేదికల ప్రకారం, షియోమీ ఫోన్ మిక్స్ ఫోల్డ్ 2 కంటే సన్నగా మరియు తేలికగా ఈ ఫోన్ ఉండాలని సూచించబడింది. దీని బరువు 262 గ్రాములు మరియు 11.2 మిమీ మందంతో ఉంటుంది. అయితే మరింత మన్నికైన బిల్ట్ డిజైన్ బాడీతో వస్తుందని చెప్పారు. ఈ మిక్స్ ఫోల్డ్ 3 వాటర్‌డ్రాప్ కీలును కలిగి ఉంటుంది, ఇది దాని డ్రాప్ రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 8.02 అంగుళాల పూర్తి-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) అంతర్గత డిస్‌ప్లే మరియు 6.5 అంగుళాల కవర్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. ఈ రెండూ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఉంటాయి. ఈ మిక్స్ ఫోల్డ్ 3 ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా 16GB వరకు LPDDDR5x RAM మరియు 1TB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తుందని భావిస్తున్నారు.
ఈ మిక్స్ ఫోల్డ్ 3 లోని లైకా ట్యూన్డ్ క్వాడ్ కెమెరా సిస్టమ్‌లు 3.2 రెట్లు వరకు జూమ్ చేసే జూమ్ లెన్స్ మరియు దీర్ఘ శ్రేణి జూమ్ కోసం 5x పెరిస్కోప్ లెన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. షియోమీ మిక్స్ ఫోల్డ్ 3 ఫోన్ 50W లేదా 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications








