Redmi యొక్క కొత్త బడ్జెట్ స్మార్ట్‌టీవీ త్వరలోనే లాంచ్!! ఫీచర్స్ ఇవే

|

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి కూడా తన యొక్క స్మార్ట్ టీవీలను ప్రపంచ మార్కెట్ లో విడుదల చేస్తూ స్మార్ట్‌టీవీ తయారీదారులందరికి పోటీని ఇస్తూ మంచి బ్రాండ్ లను బడ్జెట్ ధరలో అందించే వారిలో ఒకరిగా స్థానాన్ని దక్కించుకున్నది. అయితే ఈ సంస్థ యొక్క సబ్-బ్రాండ్ రెడ్‌మి కూడా తన యొక్క స్మార్ట్‌టీవీలను మార్కెట్లోకి విడుదల చేసి అమ్మడం ప్రారంభించింది. ఇప్పుడు రెడ్‌మి సంస్థ కొత్తగా మరొక స్మార్ట్‌టీవీని మార్కెట్లో ప్రారంభించటానికి సిద్ధమవుతున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Xiaomi New Budget Redmi Smart TV Comes Very Soon: Appears on Google Play Console Listing

గూగుల్ మద్దతు పరికరాల్లో భాగంగా గూగుల్ ప్లే కన్సోల్ జాబితాలో కనిపించిన కొత్త రెడ్‌మి స్మార్ట్ టివి గురించి ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. ఈ పరికరం 'టార్జెన్' అనే సంకేతనామం మరియు మోడల్ నంబర్ MiTV-MOOQ3 ను కలిగి ఉంది. ఈ కొత్త స్మార్ట్‌టీవీ 1920 x 1080 పిక్సెల్‌ల ఫుల్ HD స్క్రీన్ రిజల్యూషన్‌కు మద్దతును కలిగి ఉందని లిస్టింగ్ చూపిస్తుంది. అలాగే ఇది 2GB ర్యామ్‌తో జతచేయబడి ఉండడమే కాకుండా మీడియాటెక్ T31 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Xiaomi New Budget Redmi Smart TV Comes Very Soon: Appears on Google Play Console Listing

అయితే రెడ్‌మి యొక్క కొత్త స్మార్ట్‌టీవీ యొక్క స్క్రీన్ పరిమాణంకు సంబందించిన వివరాలు ఇంకా తెలియలేదు. గూగుల్ ప్లే కన్సోల్‌లో రాబోయే రెడ్‌మి స్మార్ట్ టివి కాన్ఫిగరేషన్ ఆధారంగా కంపెనీ ఈ పరికరాన్ని బడ్జెట్ కేటగిరీలో ఉంచుతోంది. ఈ పరికరాన్ని కంపెనీ ఏ మార్కెట్‌లో లాంచ్ చేస్తుందో కూడా చూడాలి. అయితే ఈ స్మార్ట్‌టీవీని త్వరలో భారత మార్కెట్లో ప్రకటించబడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన టీజర్‌లను రాబోయే రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు షియోమి భారత మార్కెట్లో రెడ్‌మి బ్రాండ్ కింద స్మార్ట్ టీవీల శ్రేణిని మాత్రమే విడుదల చేసింది. వీటిలో రెడ్‌మి స్మార్ట్ టివి X-సిరీస్ మూడు టీవీలను 50-అంగుళాలు, 55-అంగుళాలు మరియు 65-అంగుళాలు వంటి మూడు వేర్వేరు పరిమాణాలలో అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi New Budget Redmi Smart TV Comes Very Soon: Appears on Google Play Console Listing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X