Xiaomi ఫోన్‌ల ప రూ.3,000 వరకు తగ్గింపు
ఆన్‌లైన్ స్టోర్‌లలో నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న షావోమి ఇండియా, ఇప్పుడు అదే సేల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న తన ఎంఐ హోమ్ స్టోర్‌లలో నిర్వహిస్తోంది. డిసెంబర్ 23, 2017న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 1, 2018తో ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా మెగా డిస్కౌంట్ ఆఫర్లతో పాటు భారీ ధర తగ్గింపును షావోమి అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం, షావోమికి దేశవ్యాప్తంగా 15 ఎంఐ హోమ్ స్టోర్లు ఉన్నాయి. నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను పురస్కరించుకుని ఈ స్టోర్‌లలో లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.3000 వరకు, యాక్సెసరీస్ పై రూ.500 వరకు తగ్గింపును షావోమి ఆఫర్ చేస్తుంది. రూ.3000 వరకు తగ్గింపును అందుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎంఐ మిక్స్2, ఎంఐ ఏ1, ఎంఐ మ్యాక్స్ 2, రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 4 వంటి మోడల్స్ ఉన్నాయి.
నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌లో భాగంగా ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.14,999గా ఉంది.
మరో ఆఫర్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 4 64జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.11,999గా ఉంది. మరో ఆఫర్‌లో భాగంగా రెడ్‌మి4 (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్) వర్షన్‌ను రూ.500 తగ్గింపుతో రూ.8,499కే సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి4 (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వర్షన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.
ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి ఎంఐ ఇన్-ఇయర్ ప్రో హెచ్‌డి, ఎంఐ వై-ఫై రిపీటర్ 2, రెడ్‌మి నోట్ 4 సాఫ్ట్ కేస్, రెడ్‌మి నోట్ 4 స్ర్కీన్ ప్రొటెక్టర్ ఇంకా బ్లుటూత్ మినీ స్పీకర్ల పై షావోమి డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా షావోమి 3సీ రౌటర్‌ను రూ.200 తగ్గింపుతో రూ.999కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








