22 ఏళ్ల సామ్రాజ్యం నేలమట్టం, దడ పుట్టిస్తున్న షియోమి, అంతా సెకండ్ల వ్యవధిలోనే...

By Hazarath
|

చైనా దిగ్గజం షియోమి మొబైల్ దిగ్గజాలకు షాకింగ్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతీ ఫోన్ సెకండ్ల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డుతో దర్శనమిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రపంచ మార్కెట్లో నంబర్ టూ స్థానాన్ని కైవసం చేసుకుంది.

 

లేటెస్ట్ AI టెక్నాలజీతో OPPO F5 సెల్ఫీ సంచలనంలేటెస్ట్ AI టెక్నాలజీతో OPPO F5 సెల్ఫీ సంచలనం

ఇక ఇండియా మార్కెట్లో అయితే షియోమిదే రాజ్యం. ఇండియాలో 22 ఏళ్లుగా శాంసంగ్ ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని కేవలం మూడేళ్లలో వచ్చిన షియోమి నేలమట్టం చేస్తోంది. శాంసంగ్ తో పోటా పోటీగా ముందుకు దూసుకుపోతోంది.

యూజర్లకు Airtel భారీ షాక్, 3జీ నెట్‌వర్క్ షట్‌డౌన్ !యూజర్లకు Airtel భారీ షాక్, 3జీ నెట్‌వర్క్ షట్‌డౌన్ !

ఏడేళ్ల క్రితం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ..

ఏడేళ్ల క్రితం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ..

ఏడేళ్ల క్రితం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన షియోమి ప్రపంచ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఇప్పుడు రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక భారతీయ మార్కెట్‌లో అతివేగంగా దూసుకెళుతోంది.

శాంసంగ్‌తో సమానంగా..

శాంసంగ్‌తో సమానంగా..

భారత్‌ మార్కెట్‌లోకి 1995లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా మొబైల్‌ ఫోన్ల సంస్థ శాంసంగ్‌తో సమానంగా షియోమి తన మార్కెట్ ని విస్తరించుకుంటూ పోతోంది. ఓ దశలో దాన్ని కిందకు నెట్టి వేసింది కూడా.

విజయవంతమైన ఐదు స్మార్ట్‌ఫోన్లలో..

విజయవంతమైన ఐదు స్మార్ట్‌ఫోన్లలో..

భారత్‌లో విజయవంతమైన ఐదు స్మార్ట్‌ఫోన్లలో మూడు ఫోన్లు ఈ కంపెనీ ఉత్పత్తులు కావడమంటేనే తెలుస్తోంది షియోమి ఏ స్థాయిలో దూసుకెళ్తుందో.. ఈ కంపెనీ 2014, సెప్టెంబర్‌లో రెడ్‌మి 1ఎస్‌ మోడల్‌ తీసుకొచ్చినప్పుడు 40 వేల స్మార్ట్‌ఫోన్లు 4.2 సెకండ్లలో అమ్ముడుపోయాయి.

2014లో దేశంలోకి అడుగుపెట్టిన షియోమి..
 

2014లో దేశంలోకి అడుగుపెట్టిన షియోమి..

2014లో దేశంలోకి అడుగుపెట్టిన షియోమి కంపెనీ గత రెండేళ్ల కాలంలో భారత ఉప ఖండంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్‌ డేటా సంస్థ తెలియజేసింది. రానున్న మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలంలో మరో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది.

ఫ్లాష్‌ సేల్స్‌ ద్వారా కొన్ని సెకడ్లలోనే ..

ఫ్లాష్‌ సేల్స్‌ ద్వారా కొన్ని సెకడ్లలోనే ..


ఫ్లాష్‌ సేల్స్‌ ద్వారా కొన్ని సెకడ్లలోనే తన ఉత్పత్తులన్నింటిని విక్రయించడం భారత్‌లో ఇప్పటి వరకు ఈ ఒక్క కంపెనీకే చెల్లిందని చెప్పవచ్చు. గతంలో కేవలం ఆన్‌లైన్‌ మార్కెట్‌నే నమ్ముకున్న ఈ సంస్థ ఇప్పుడు భారత్‌లో 30 శాతం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ను ఆక్రమించింది.

అమ్మకాల షేర్‌..

అమ్మకాల షేర్‌..

భారత మార్కెట్‌లో ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల షేర్‌ గతేడాది ఆరు శాతం నుంచి ఏకంగా 22 శాతానికి దూసుకుపోయిందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘కౌంటర్‌ పాయింట్‌ రీసర్చ్‌' వెల్లడించింది.

ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం..

ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం..

ధరకు తగ్గ నాణ్యతను పాటించడమే కాకుండా కేవలం ఈ-వాణిజ్యం ద్వారా, అంటే ఇంటర్నెట్‌ ద్వారానే విక్రయించడం, ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా షియోమీ భారతీయ మార్కెట్‌లో కొత్త చరిత్రను సష్టించింది.

మి హోమ్‌' పేరిట సొంత షాపులను..

మి హోమ్‌' పేరిట సొంత షాపులను..

ఆఫ్‌లైన్‌లో కూడా తమ అమ్మకాలను కొనసాగించేందుకు షియోమి ‘మి హోమ్‌' పేరిట సొంత షాపులను ఏర్పాటు చేస్తోంది. మిగతా కంపెనీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అమ్మకాల ద్వారా కూడా వినియోగదారులను ఇంతగా ఆకర్షించలేకపోతున్నాయి.

అవకాశంలేని చోట..

అవకాశంలేని చోట..

అవకాశంలేని చోట క్రోమా, యూనివర్సల్, పూర్విక, సంగీత రిటైల్‌ చైన్లతో ఒప్పందం పెట్టుకుంటోంది. భారత్‌లో రెడ్‌మి నోట్‌ 4, రెడ్‌మి 4, రెడ్‌మి 4ఏ.. ఇంకా కొన్ని మోడళ్లు సూపర్‌ హిట్టయిన విషయం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Xiaomi on set for a new record with over 70M shipments Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X