Mi Home స్టోర్ ప్రారంభం, ఇక అన్ని అక్కడే కొనేయవచ్చు

ఆఫ్‌లైన్ మార్కెట్లో తొలి అడుగు..

|

షియోమీ తన మొట్టమొదటి Mi Home Storeను బెంగుళూరులో గురువారం ప్రారంభించింది. మే 20 నుంచి ఈ స్టోర్ పబ్లిక్‌కు అందుబాటులో ఉంటుంది. షియోమీకి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.

Mi Home స్టోర్ ప్రారంభం, ఇక అన్ని అక్కడే కొనేయవచ్చు

Read More : విడుదలకు ముందే దుమ్మురేపుతోన్న OnePlus 5

వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 100 Mi Home Storeలను లాంచ్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా చెన్నై వంటి మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10,000 వరకు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో షియోమీ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

సామ్‌సంగ్‌ను క్లోజ్‌గా ఫాలో చేస్తున్న షియోమీ..

సామ్‌సంగ్‌ను క్లోజ్‌గా ఫాలో చేస్తున్న షియోమీ..

తన Redmi సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో Xiaomi బ్రాండ్ దూసుకుపోతున్నప్పటికి సామ్‌సంగ్‌ను మాత్రం బీట్ చేయలేక‌పోతోంది. సింగపూర్‌కు చెందిన ప్రముఖ రిసెర్చ్ సంస్థ Canalys తాజాగా జరిపిన విశ్లేషణ ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్, ఇప్పటికి భారతదేశపు నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గానే కొనసాగుతోంది.

 

2017 మొదటి క్వార్టర్ అమ్మకాలు

2017 మొదటి క్వార్టర్ అమ్మకాలు

క్వార్టర్లీ అమ్మకాలకుగానూ సామ్‌సంగ్‌ తరువాతి స్థానాలను షియోమీ, వివో, లెనోవో, ఒప్పో బ్రాండ్‌లు సొంతం చేసుకున్నాయి. 2017 మొదటి క్వార్టర్‌కు గాను సామ్‌సంగ్ దాదాపుగా 6 మిలియన్ డివైస్‌లను విక్రయించగా, షియోమీ 4 మిలియన్ డివైస్‌లను విక్రయించగలిగింది.

 

షియోమీ మార్కెటింగ్ స్ట్రేటజీలు
 

షియోమీ మార్కెటింగ్ స్ట్రేటజీలు

ఆన్‌లైన్ మార్కెటింగ్ స్ట్రేటజీలు షియోమీకి బాగా కలిసొచ్చాయని Canalys రిసెర్చ్ సర్వే చెబుతోంది. ఇదే సమయంలో మరే బ్రాండ్‌కు లేన్నంత విస్తృతమైన స్మార్ట్‌ఫోన్ పోర్టిఫోలియోను సామ్‌సంగ్ కలిగి ఉండటంతో అమ్మకాలు మరింత ఆశాజనకంగా సాగాయని విశ్లేషణ చెబుతోంది.

 

షియోమీ సక్సెస్‌ వెనుక...

షియోమీ సక్సెస్‌ వెనుక...

షియోమీ సక్సెస్‌కు కేవలం మూడు లేదా నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు దోహదపడ్డాయని, ఇదే సమయంలో సామ్‌సంగ్ సక్సెస్‌కు అనేక గెలాక్సీ సిరీస్ మోడల్స్ దోహదపడ్డాయని Canalys రిసెర్చ్ వెల్లడించింది.

11% నుంచి 14% శాతం పెరిగిన అమ్మకాలు..

11% నుంచి 14% శాతం పెరిగిన అమ్మకాలు..

షియోమీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 2016 మొదటి క్వార్టర్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 2017 మొదటి క్వార్టర్‌లో జరిగిన అమ్మకాలు 11% నుంచి 14% శాతం పెరిగాయని Canalys రిసెర్చ్ వెల్లడించింది.

 

Best Mobiles in India

English summary
Xiaomi opens its first Mi Home Store in India to strengthen its position in offline market. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X