Home
News

ఆపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ.. ప్రపంచంలోనే నంబర్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఘనత..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) మరో రికార్డును సొంతం చేస్తుంది. ఆగస్టు 2024 విక్రయాల్లో సత్తా చేసి.. ఆపిల్‌ను వెనక్కినెట్టింది. కౌంటర్‌ పాయింట్ కథనం ఆధారంగా ఆగస్టు 2024లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ 2వ స్థానంలో నిలిచింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆపిల్‌ మూడో స్థానానికి పరిమితం అయింది. అయితే తొలి స్థాయిలో శాంసంగ్‌ ఉంది.

ఆగస్టు 2021 తర్వాత తొలిసారిగా గ్లోబర్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విక్రయాల పరంగా ఆగస్టు 2024లో షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. సరఫరా కష్టాలు సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ల తరహాలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే అనంతరం ఉత్పత్తి, విక్రయాల్లో ప్రత్యేక వ్యూహాన్ని పక్కాగా అమలుచేసింది.

Xiaomi Overtakes apple and become no2 smartphone brand

షియోమీ ఈ సంవత్సరం Leaner ప్రొడక్ట్‌ స్ట్రాటజీని అవలంభించినట్లు రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠర్‌ తెలిపారు. దీని ఆధారంగా ఒకే ధర సెగ్మెంట్‌లో ఎక్కువ ఉత్పత్తులను లాంచ్‌ చేయడం కంటే ఒక్కో ధరలో ఒక్కో మోడల్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది. దీంతోపాటు మార్కెటింగ్‌ వ్యూహాల్లోనూ మార్పులు చేసింది. కొత్త మార్కెట్‌లలోకి విస్తరణతోపాటు ఇప్పటికే ఉన్న మార్కెట్‌లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రయత్నం చేసింది.

ఇప్పటికే షియోమీ ఎంట్రీ, మిడ్‌రేంజ్‌ ఉత్పత్తులు బలమైన పనితీరును కనబరు‌స్తున్నాయి. మరియు షియోమీ.. ఫోల్డబుల్‌, అల్ట్రా మోడళ్లతో ప్రీమియం విభాగంలోనికి ప్రవేశించింది. గత కొన్ని త్రైమాసికాల్లో కొన్ని మార్కెట్‌లలో షియోమీ పరిస్థితి మెరుగుపడింది. తక్కువ ధర కలిగిన బ్రాండ్‌లకు ప్రయోజనం కలిగింది. ఇప్పటికే తక్కువ ధర కలిగిన బ్రాండ్‌లలో షియోమీ బలంగా ఉంది. ముఖ్యంగా రెడ్‌మి 13 మరియు నోట్ 13ల విడుదల తర్వాత రెడ్‌మి పరికరాలు మరింత పాపులర్ అయ్యాయి.

భారత్‌, లాటిన్‌ అమెరికా, ఆగ్నేసియా వంటి దేశాల సహా ఆఫ్రికాలో వాటాను పొందడంలో సాయపడింది. అయితే షియోమీ రెండో స్థానానికి చేరుకోవడంలో వ్యూహాలు, వృద్ధి కారణం అయితే.. ఆపిల్‌ కొత్త ఉత్పత్తుల విడుదల కూడా కారణంగా తెలుస్తోంది. కొత్త ఐఫోన్‌లు సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుండడంతో.. ఆగస్టు నెలలో విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే రానున్న నెలల్లో ఆపిల్‌ అమ్మకాలు పుంజుకొనే అవకాశం ఉంది.

ఫోల్డబుల్స్ వంటి ఉత్పత్తుల తయారీలో ఆవిష్కరణలు మరియు జనరేటివ్‌ AI ఫీచర్లు వంటి రంగాల్లో షియోమీ వంటి అగ్రశ్రేణి సంస్థలు తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షియోమీ రెండో స్థానంలో నిలవడం ట్రెండ్‌కు ప్రతీకగా చూడాలి. అయితే టెక్నాలజీ, ధరల పరంగా ఈ ఉత్పత్తులు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అయితే విక్రయాలు, వ్యూహాలు పరంగా ఈ స్థానాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Overtakes apple and become no2 smartphone brand in the world in august 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X