Home
News

షియోమీ నుంచి సూపర్ ఫీచర్‌లతో స్మార్ట్‌ టీవీ సిరీస్‌ విడుదల.. ఇన్‌బిల్ట్ ఫైర్‌ టీవీ, బెస్ట్‌ ఆడియో అవుట్‌పుట్‌

భారత్‌ మార్కెట్‌లో షియోమీ సంస్థ QLED TV FX Pro మరియు 4K TV FX సిరీస్‌లను విడుదల చేసింది. ఈ మోడల్స్‌ 43, 55 అంగుళాల స్ర్కీన్ సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్‌ ద్వారా మెరుగైన ఆడియో విజువల్‌ అనుభూతిని పొందవచ్చని షియోమీ చెబుతోంది. QLED మోడల్స్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో 34W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ సిరీస్‌ అనేక బెస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది.

షియోమీ 4K TV FX సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు 43 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్‌ సైజుల్లో లాంచ్‌ అయ్యాయి. ఇన్‌బిల్ట్‌ అమెజాన్‌ ఫైర్‌ టీవీ సపోర్టును పొందుతుంది. దీంతోపాటు ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌, Zee5, సోనీలివ్‌ వంటి యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఇన్‌బిల్ట్‌ ఫైర్‌ టీవీ ద్వారా సులభంగా DTH ఛానల్స్‌ నుంచి OTT యాప్స్‌కు మారవచ్చు.

Xiaomi QLED TV FX Pro and 4K TV FX Series telugu news

ఈ స్మార్ట్‌టీవీ సిరీస్‌ (Xiaomi 4K TV FX Series) బెజిల్‌ లెస్ మెటల్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో DTS వర్చువల్‌ X కలిగి ఉంది. మరియు 4K UHD పిక్చర్‌ క్వాలిటీని కలిగి ఉంటుంది.

షియోమీ QLED TV FX Pro సిరీస్‌ స్మార్ట్‌టీవీ సిరీస్‌ :
ఈ మోడల్‌ కూడా 43 అంగుళాలు, 55 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌టీవీ సిరీస్‌ 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను డిస్‌ప్లేను కలిగి ఉంది. 43 అంగుళాల వేరియంట్‌ 60Hz రీఫ్రెష్‌ రేట్, 55 అంగుళాల వేరియంట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. 178 డిగ్రీల వీక్షణ, 96.9 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది.

ఈ సిరీస్ క్వా్డ్‌ కోర్‌ A55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు Mali G52 MC1 GPU కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ సిరీస్‌లో Vivid పిక్చర్ ఇంజిన్‌ 2 మరియు DLG టెక్నాలజీని ఉపయోగించింది.

షియోమీ QLED TV FX ప్రో సిరీస్‌ 43 అంగుళాల వేరియంట్‌ 30W స్పీకర్‌లను కలిగి ఉంది. అదే 55 అంగుళాల వేరియంట్‌ డాల్బీ ఆడియో, DTS:X మరియు DTS Virtual:X 34W బాక్స్‌ స్పీకర్‌లను అమర్చారు. ఈ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు మూడు HDMI పోర్టులను కలిగి ఉంది. బ్లూటూత్‌, డ్యూయల్ బ్యాండ్‌ వైఫై తోపాటు ఎయిర్‌ప్లే 2 మరియు miracast వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.

Xiaomi QLED TV FX Pro and 4K TV FX Series telugu news

షియోమీ QLED TV FX Pro సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
షియోమీ QLED TV FX Pro సిరీస్‌ స్మార్ట్‌టీవీ (Xiaomi QLED TV FX Pro) 43 అంగుళాల మోడల్‌ ధర రూ.27999 గా ఉంది. అదే 55 అంగుళాల వేరియంట్‌ ధర రూ.39999 గా ఉంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సిరీస్‌ కేవలం బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది.

షియోమీ 4K TV FX సిరీస్‌ 43 అంగుళాల వేరియంట్‌ ధర రూ.26499 గా ఉంది. 55 అంగుళాల స్క్రీన్‌ కలిగిన మోడల్‌ ధర రూ.36000 గా ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ రెండు స్మార్ట్‌టీవీ సిరీస్‌లను మే 12 వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.

షియోమీ QLED TV FX Pro మరియు షియోమీ 4K TV FX సిరీస్‌ స్మార్ట్‌టీవీలను Mi ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi QLED TV FX Pro and 4K TV FX Series launched in india check price and sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X