షియోమీ భారీ డిస్‌ప్లేతో స్మార్ట్‌టీవీ విడుదల.. ముందస్తు బుకింగ్‌పై రూ.10999 విలువైన ప్రయోజనాలు..!
షియోమీ భారీ డిస్‌ప్లే స్మార్ట్‌టీవిని భారత్‌లో విడుదల చేసింది. షియోమీ QLED TV X ప్రో 75 పేరుతో (Xiaomi QLED TV X Pro 75) లాంచ్ చేసింది. సంస్థ విడుదల చేసిన అతి పెద్ద QLED టీవీ ఇదేనని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌టీవీ డాల్బీ విజన్, HDR10+, 34W స్పీకర్లను కలిగి ఉంది. ఈ టీవీని ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ టీవీ పూర్తి ఫీచర్ల వివరాలు.
షియోమీ స్మార్ట్‌టీవీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
షియోమీ QLED TV X ప్రో 75 స్మార్ట్‌టీవీ బెజెల్ లెస్ డిజైన్‌తో లాంచ్ అయింది. 75 అంగుళాల QLED 4K అల్ట్రా HD డిస్‌ప్లేను (3840 x 2160 పిక్సల్స్) కలిగి ఉంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఫిల్మ్ మేకర్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. 97.76 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

ప్రాసెసర్ :
ఈ షియోమీ టీవీ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్, 32GB స్టోరేజీని కలిగి ఉంది. ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ పైన పనిచేస్తుంది. కిడ్స్ మోడ్, పేరెంటల్ కంట్రోల్, యూనివర్సల్ సెర్చ్, లాంగ్వేజ్ యూనివర్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఉచితంగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది.
మెరుగైన ఆడియో కోసం :
షియోమీ స్మార్ట్‌టీవీ మెరుగైన ఆడియో కోసం డాల్బీ ఆడియో, DTS X, DTS వర్చువల్ X సపోర్టుతో 34W స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వాకల్ క్లారిటీ, బేస్ రెన్పాన్స్ కోసం షియోమీ సౌండ్ ట్యూనింగ్ ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌టీవీ డ్యూయల్ లైన్ గేట్ టెక్నాలజీ, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపేన్సేషన్ టెక్నాలజీలను కలిగి ఉంది. ఈ టీవీ గేమింగ్ కన్సోల్ కోసం ఆటో లో లేటెన్సీ మోడల్ ను కలిగి ఉంది. ఈ షియోమీ టీవీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను సపోర్టు చేస్తుంది.
కనెక్టివిటీ పరంగా మూడు HDMI పోర్టులు, 2 USB 2.0 పోర్టులు, ఇథర్‌నెట్, AV, యాంటెనా, ఆప్టికల్, ఇయర్‌ఫోన్ పోర్టులను కలిగి ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఎయిర్ ప్లే 2, గూగుల్ కాస్ట్, మిరా కాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
షియోమీ QLED TV X ప్రో 75 ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌టీవీ ధర రూ.69999 గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ టీవీ సేల్ ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానుంది.
ఈ షియోమీ టీవీని ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి 4 సంవత్సరాల పూర్తి వారంటీని అందిస్తామని చెబుతోంది. వారంటీ విలువ రూ.10999 గా ఉందని తెలిపింది. షియోమీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications








