4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6,999

Written By:

4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6,999

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి ఈ ఏడాది ఆరంభంలో ‘రెడ్మీ 2' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలసిందే. రెడ్మీ 1ఎస్‌కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించారు. ధర రూ.6,999. వైట్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ ఫోన్‌ను మార్చి 24 నుంచి మార్కెట్లో విక్రయిస్తారు. ఈ ఫోన్ మొదటి సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ రోజు సాయత్రం 6 గంటల నుంచి ప్రారంభించనుంది.

4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6,999

షియోమి రెడ్మీ 2 స్పెసిఫికేషన్‌లు...

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ లామినేటెడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 31 పీపీఐ), ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 64బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్), 28ఎమ్ఎమ్ వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6,999

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు:

డ్యుయల్ సిమ్‌ కార్డ్ స్లాట్స్, ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్ (టీడీడీ - ఎల్టీఈ బ్యాండ్ 40 2300 మెగాహెర్ట్జ్, ఎఫ్‌డీడీ -ఎల్టీఈ బ్యాండ్ 3 1800 మెగాహెర్ట్జ్), వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో, బ్లూటూత్, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్.English summary
Xiaomi Redmi 2 launched in India for Rs 6,999, features HD display, 64-bit processor and LTE connectivity: Specifications and features. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting